Singham Again OTT Release Date: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న రూ.400 కోట్ల యాక్షన్ మూవీ
Singham Again OTT Release Date: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ భారీ యాక్షన్ మూవీ రాబోతోంది. ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లతో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Singham Again OTT Release Date: ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా ఏడుగురు స్టార్ హీరో, హీరోయిన్లు నటించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ సింగం అగైన్. సూపర్ హిట్ సింగం ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. కొన్ని రోజుల కిందటే ఎర్లీ యక్సెస్ పేరుతో రెంటల్ విధానంలో వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి రానుంది.
సింగం అగైన్ ఓటీటీ రిలీజ్ డేట్
బాలీవుడ్ నటీనటులు అజయ్ దేవగన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్, అర్జున్ కపూర్ లాంటి వాళ్లు నటించిన భారీ బడ్జెట్ మూవీ సింగం అగైన్. ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెడుతోంది.
ఏకంగా రూ.370 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.390 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు ప్రైమ్ వీడియో తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "సింహ గర్జనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. రేపు ప్రైమ్ వీడియోలోకి సింగం అగైన్ వస్తోంది" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.
సింగం అగైన్ మూవీ గురించి..
సింగం అగైన్ మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ లోని ఎంతో మంది పేరున్న స్టార్లు నటించడంతో భారీ అంచనాల మధ్య రిలీజైంది. అయితే మూవీ మాత్రం ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది.
రామాయణం స్టోరీ బ్యాక్‌డ్రాప్ లో బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ట్రైలర్ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసినా.. సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మరి థియేటర్లలో అంతగా సక్సెస్ కాని ఈ మూవీకి ఓటీటీలోకి ఎంత మేర రెస్పాన్స్ వస్తుందన్నది చూడాలి.