OTT Movies: ఒకే వారంలో ఓటీటీల్లోకి వచ్చిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-singham again and horror comedy bhool bhulaiyaa 3 released on otts in same day on amazon prime video and netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఒకే వారంలో ఓటీటీల్లోకి వచ్చిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Movies: ఒకే వారంలో ఓటీటీల్లోకి వచ్చిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 29, 2024 03:38 PM IST

OTT Movies: ఈ వారంలో రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. థియేటర్లలో ఒకే రోజు రిలీజై పోటీ పడిన ఈ సినిమాలు.. ఓటీటీల్లో కూడా అదే ఫాలో అయ్యాయి. ఈ చిత్రాలు ఒకే రోజు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఆ వివరాలు ఇవే..

OTT Movies: ఒకే వారంలో ఓటీటీల్లోకి వచ్చిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Movies: ఒకే వారంలో ఓటీటీల్లోకి వచ్చిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

దీపావళి సందర్భంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సింగం అగైన్, భూల్ భులయ్యా 3 సినిమాలు పోటీ పడ్డాయి. పాపులర్ ఫ్రాంచైజీల నుంచి వచ్చిన ఈ చిత్రాలు నవంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. భారీ అంచనాలు ఉన్న ఈ క్రేజీ చిత్రాలు నువ్వానేనా అన్నట్టుగా వచ్చాయి. భారీ మల్టీస్టారర్ యాక్షన్ మూవీగా సింగం అగైన్ రాగా.. హారర్ కామెడీ జానర్లో మంచి క్రేజ్‍తో భూల్ భులయ్యా 3 అడుగుపెట్టింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలోనూ ఈ రెండు చిత్రాలు పోటీకి దిగాయి. ఈ వారంలో ఒకే రోజున సింగం అగైన్, భూల్ భులయ్యా 3 చిత్రాలు వేర్వేరు ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. ఆ వివరాలివే..

yearly horoscope entry point

సింగం అగైన్

యాక్షన్ డ్రామా మూవీ సింగం అగైన్ శుక్రవారం (డిసెంబర్ 27) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ముందుగా రెంట్‍ విధానంలో వచ్చిన ఈ మూవీ.. ఈ వారం సాధారణ స్ట్రీమింగ్‍కు వచ్చింది. అజయ్ దేవ్‍గణ్, రణ్‍వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దీపికా పదుకొణ్, టైగర్ ష్రాఫ్‍లు ప్రధాన పాత్రలతో ఈ మూవీ క్రేజీ మల్టీస్టారర్‌గా రూపొందింది. ఈ చిత్రం అర్జున్ కపూర్ నెగెటివ్ రోల్ చేశారు. సింగం అగైన్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నవంబర్ 1న థియేటర్లలో రిలీజైంది.

సింగం అగైన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. రూ.350కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ సుమారు ప్రపంచవ్యాప్తంగా రూ.390కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దీంతో ఈ మల్టీస్టారర్ మూవీ కమర్షియల్‍గా బ్లాక్‍బస్టర్ కొట్టలేదు. ఈ చిత్రంపై ట్రోల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. నెగెటివ్ టాక్ ఎక్కువగా నడిచింది. అయితే, స్టార్స్ ఎక్కువగా ఉండటంతో కలెక్షన్లు మోస్తరుగా దక్కించుకోగలిగింది. సింగం అగైన్ మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో హిందీలో చూడొచ్చు.

భూల్ భులయ్యా 3

భూల్ భులయ్యా 3 మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. ఈ హారర్ కామెడీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డిసెంబర్ 27వ తేదీనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. నవంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కలెక్షన్లలో దుమ్మురేపింది. సుమారు రూ.150కోట్ల బడ్జెట్‍తో రూపొందిన భూల్ భులయ్యా 3.. సుమారు రూ.417 గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు.

భూల్ భులయ్యా 3 మూవీలో కార్తీక్ ఆర్యన్‍ సహా విద్యాబాలన్, మాధురీ దీక్షిత్‍తో పాటు తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు చేశారు. హారర్‌తో పాటు కామెడీ కూడా ఈ మూవీలో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాకే వచ్చినా కలెక్షన్లను మాత్రం జోరుగా రాబట్టింది. భారీ బడ్జెట్‍తో వచ్చిన సింగం అగైన్‍ను దాటేసి కలెక్షన్లలో దుమ్మురేపింది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి. భూల్ భులయ్యా 3 మూవీ ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం