Simbu The Life of Muthu: శింబు లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా మార్నింగ్ షోస్ క్యాన్సిల్
Simbu The Life of Muthu: శింబు,గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో రూపొందిన లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా నేడు తెలుగులో రిలీజ్ అవుతోంది. తెలుగులో ఈ సినిమా మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. మధ్యాహ్నం ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Simbu The Life of Muthu: శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన లైఫ్ ఆఫ్‌ముత్తు సినిమా నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో రూపొందిన వెండు థనిందాతు కాడు సినిమాను లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. తమిళంలో సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. తెలుగు ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ రిలీజ్ చేస్తోంది. తెలుగులో రెండు రోజులు ఆలస్యంగా సెప్టెంబర్ 17న విడుదలకానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
కాగా శనివారం లైఫ్ ఆఫ్ ముత్తు మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. మ్యాట్నీ షో నుంచి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. బుకింగ్స్ యాప్ లో ఈవినింగ్ షోస్ టికెట్లు మాత్రమే చూపిస్తుండటంతో మధ్యాహ్నం కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. శింబు, గౌతమ్ మీనన్ ఇద్దరికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మరోవైపు అగ్ర నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. అయినా సినిమాపై ఏ మాత్రం బజ్ కనిపించడం లేదు.
హైదరాబాద్‌లో పది థియేటర్లు కూడా దొరకలేదు. తమిళంలో నెగెటివ్ టాక్ రావడం, శుక్రవారం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నేను మీకు బాగా కావాల్సిన వాడిని తో మరో నాలుగైదు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కావడం కూడా శింబు సినిమాకు థియేటర్లు సరిగా దొరక్కపోవడానికి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.
గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాంశంతో గౌతమ్ మీనన్ ఈ సినిమాను రూపొందించారు. పల్లెటూరి నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఓ యువకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది యాక్షన్, లవ్, థ్రిల్ మేళవించి చూపించబోతున్నారు.