Silence 2 OTT: ఓటీటీల్లో మిస్టరీ క్రైమ్ థిల్లర్ల హవా జోరుగా సాగుతోంది. ఈ జానర్ మూవీలకు ఎక్కువగా ఆదరణ దక్కుతోంది. అందులోనూ ముందు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాకు సీక్వెల్ అంటే క్రేజ్ బాగా కనిపిస్తోంది. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ‘సైలెన్స్ 2’ చిత్రం విషయంలోనూ ఇదే కొనసాగింది. సైలెన్స్ మూవీకి సీక్వెల్‍గా మూడేళ్ల తర్వాత నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సీక్వెల్ అదరగొడుతోంది. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‍పేయీ ప్రధాన పాత్ర పోషించిన సైలెన్స్ 2 మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఆ వివరాలివే..
సైలెన్స్ 2 సినిమా ఏప్రిల్ 16వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీకి సీక్వెల్ కావడం, మనోజ్ బాజ్‍పేయ్ ఉండటంతో మొదటి నుంచే ఈ మూవీ భారీగా వ్యూస్ వస్తున్నాయి. మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నా.. వ్యూస్ పరంగా మాత్రం దూసుకెళుతోంది.
తొలి 24 గంటల్లోనే సైలెన్స్ 2 చిత్రం 60 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. ఆ తర్వాత కూడా అదే రేంజ్‍లో సత్తాచాటుతోంది. దీంతో జీ5 ఓటీటీలో ఈ చిత్రం ఇప్పుడు నేషనల్ వైడ్‍లో టాప్‍కు వచ్చేసింది. గామి చిత్రాన్ని దాటి టాప్ ప్లేస్‍కు చేరుకుంది.
సైలెన్స్ 2 చిత్రంలో మనోజ్ బాజ్‍పేయ్‍తో పాటు ప్రాచీ దేశాయ్, దినకర్ శర్మ, చేతన్ శర్మ, సాహిల్ వైద్, పారుల్ గులాటీ, వాకర్ షేక్ కీలకపాత్రల పోషించారు. ఏసీడీ అవినాశ్ వర్మగా మరోసారి తన మార్క్ యాక్టింగ్‍తో మనోజ్ అదరగొట్టారు. ఈ చిత్రానికి అబన్ బరూచా దేవోహన్స్ దర్శకత్వం వహించారు.
ముంబైలోని నైట్ ఔల్ బార్‌లో జరిగే కాల్పుల కేసును అవినాశ్ వర్మ (మనోజ్ బాజ్‍పేయ్) సారథ్యంలోని స్పెషల్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు చేయడం చుట్టూ సైలెన్స్ 2 మూవీ కథ తిరుగుతుంది. కొన్ని ట్విస్టులతో కథ సస్పెన్స్‌గా సాగుతుంది.
సైలెన్స్ 2 చిత్రాన్ని జీ స్టూడియోస్‍తో కలిసి కిరణ్ దేవ్‍హాన్స్ నిర్మించారు. ఈ చిత్రానికి గౌరవ్ కోడ్‍ఖిండ్ సంగీతం అందించగా.. పూజా గుప్తే సినిమాటోగ్రఫీ చేశారు.
తెలుగు అడ్వెంచరస్ థ్రిల్లర్ గామి సినిమా కూడా జీ5 ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంటోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఏప్రిల్ 12వ తేదీన జీ5 ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ నటించిన ఈ గామి చిత్రానికి జీ5లో భారీ రెస్పాన్స్ వస్తోంది.
గామి చిత్రం జీ5లో మొదటి నుంచి భారీగా వ్యూస్ దక్కించుకుంది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన గామికి ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో నేషనల్ వైడ్‍లో టాప్‍లో ట్రెండ్ అయింది. వారం పాటు టాప్‍లోనే కొనసాగింది. అయితే, ఇప్పుడు సైలెన్స్ 2 చిత్రం రావడంతో గామి జీ5 ఓటీటీలో నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్-2లో ఉంది.
టాపిక్