ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 200 కోట్ల యాక్షన్ థ్రిల్లర్- 3 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!-sikandar ott streaming on netflix salman khan rashmika mandanna kajal aggarwal sikandar ott release today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 200 కోట్ల యాక్షన్ థ్రిల్లర్- 3 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 200 కోట్ల యాక్షన్ థ్రిల్లర్- 3 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ రూ. 200 కోట్ల బడ్జెట్ మూవీ సికందర్ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సుమారు రెండు నెలల తర్వాత వచ్చిన సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 200 కోట్ల యాక్షన్ థ్రిల్లర్- 3 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి అలరిస్తుంటాయి. నెల నుంచి రెండు, మూడు నెలల వ్యవధిలో థియేట్రికల్ రిలీజ్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు, ఫ్లాప్ మూవీస్‌తోపాటు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఉంటాయి. అలాంటి భారీ బడ్జెట్ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

స్టార్ హీరో హీరోయిన్స్

ఓటీటీలోకి ఇవాళ (మే 25) లేటెస్ట్ మూవీ సికందర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ మూవీనే సికందర్. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు.

ఐదేళ్ల గ్యాప్ తర్వాత

చాలా కాలం గ్యాప్ తర్వాత అంటే సుమారుగా 2020లో రజనీకాంత్‌తో దర్బార్ మూవీ తర్వాత మురుగదాస్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించడం, స్టార్ హీరో, హీరోయిన్స్ ఉండటంతో సికందర్‌పై మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రమోషనల్ కంటెంట్ కాస్తా మెప్పించింది. అయితే, అంచనాలకు అనుగుణంగా సికందర్ ఆకట్టుకోలేకపోయింది.

సికందర్ టాక్

నడియడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బానర్లపై నిర్మించిన సికందర్ సినిమా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. కానీ, రొటీన్ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, పెద్దగా ఆకట్టుకోలేని సీన్లు ఉండటంతో మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపించుకున్నాయి.

సికందర్ బడ్జెట్-కలెక్షన్స్

రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సికందర్ మూవీకి రూ. 176.18 నుంచి 177 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే, కాస్తలో సినిమా బ్రేక్ ఈవెన్‌తో హిట్‌ను చేజార్చుకుంది. ఇలాంటి సికందర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ ఆదివారం (మే 25) నెట్‌ఫ్లిక్స్‌లో సికందర్ ఓటీట రిలీజ్ అయిది. అది కూడా మూడు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్

హిందీ, అరబిక్, జులు వంటి మూడు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సికందర్ కథ విషయానికొస్తే.. సంజయ్ రాజ్‌కోట్ (సల్మాన్ ఖాన్) గుజరాత్‌లో ఒక పవర్‌ఫుల్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్. అతను అక్కడ సికందర్‌గా బాగా పేరు తెచ్చుకుంటాడు. పెయింటర్ అయిన సాయిశ్రీ (రష్మిక మందన్నా)ను పెళ్లి చేసుకుంటాడు సంజయ్.

శృంగారం చేయాలని

ఓ రోజు ఫ్లైట్‌లో సంజయ్ వెళ్తుంటే మంత్రి రాకేష్ ప్రధాన్ (సత్యరాజ్) కుమారుడు అర్జున్ ప్రధాన్ (ప్రతీక్ స్మిత పాటిల్) మాజీ పోర్న్ స్టార్ మోనికాను హరాజ్ చేస్తుంటాడు. అయితే, ఆమెకు పెళ్లి అయి కొడుకు కూడా ఉంటాడు. తనతో సెక్స్ చేయాలని లేకుంటే ఆమె కొడుకుకు మోనికా పోర్న్ వీడియోలు చూపించి తల్లిని బెదిరిస్తాడు. అదంతా చూసిన సంజయ్ రాజ్‌కోట్ అర్జున్‌ను చితకబాది మోనికాకు సారీ చెప్పిస్తాడు.

సికందర్ ట్విస్టులు

ఇదంతా తెలిసిన అర్జున్ తండ్రి మంత్రి సికందర్‌ను అరెస్ట్ చేయడానికి ఓ పోలీస్‌ను అపాయింట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? సంజయ్ రాజ్‌కోట్ గురించి పోలీస్ ఏం తెలుసుకున్నాడు? సికందర్-మంత్రి గొడవ ఎక్కడికి దారి తీసింది?, వైధేహి రంగచారి (కాజల్ అగర్వాల్) పాత్ర ఏంటీ? అనేది సికందర్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన సికందర్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం