ఓటీటీ రెస్పాన్స్‌కు థియేటర్ల టాక్‌కు భిన్నంగా సినిమాల ఫలితాలు ఉంటాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. థియేటర్లలో డిజాస్టర్స్‌గా నిలిచిన ఎన్నో సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతుంటాయి. అలాగే, కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో అదరగొట్టిన మూవీస్ సైతం ఓటీటీలో మిశ్రమ స్పందన తెచ్చుకుంటాయి.
ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఇటీవల కాలంలో చెప్పలేకుండా ఉంది. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా ఓ సినిమా కూడా ఇలాంటి రెండు విభిన్నమైన ఫలితాలను చవిచూసింది. రూ. 200 కోట్ల బడ్జెట్ పెట్టిన తీసిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాక మాత్రం దంచికొడుతోంది.
ఆ సినిమా మరేదో కాదు సికందర్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారి జోడి కట్టిన సినిమా ఇది. అలాగే, ఇందులో బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటించడం విశేషం. చాలా కాలం గ్యాప్ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన సినిమా సికందర్.
ఇలా ఎన్నో విశేషాలు ఉన్న సికందర్ భారీ అంచనాలతో థియేటర్లలో మార్చి 30న విడుదలైంది. అయితే, పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుని సికందర్ డిజాస్టర్‌గా మిగిలింది. రొటీన్ కథ, యాక్షన్, సీన్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. రూ. 200 కోట్లతో తీసిన సికందర్ సినిమాకు బడ్జెట్ అంత కూడా కలెక్షన్స్ రాలేదని సమాచారం.
అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి పదికి 4లో అత్యంత చెత్త రేటింగ్‌ను సికందర్ మూవీ నమోదు చేసుకుంది. ఇక ఫ్రెష్ కంటెంట్‌పై సర్టిఫికేట్ ఇచ్చే రొట్టెన్ టోమాటోస్ కేవలం 6 శాతం మాత్రమే తాజా కంటెంట్ అని డిక్లేర్ చేసింది. ఇలాంటి నెగెటివ్ టాక్ ఉన్న సికందర్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 25న ఓటీటీ రిలీజ్ అయింది.
హిందీ, అరబిక్ (సిరియా), జులు వంటి 3 భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన రెండో రోజు నుంచే సికందర్ ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్‌లో దంచికొట్టింది. మొన్నటి (మే 29) వరకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 1 స్థానంలో సికందర్ నిలిచి సత్తా చాటింది.
కానీ, నిన్నటి (మే 30) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 1 నుంచి టాప్ 2 స్థానంలోకి వెనక్కి వెళ్లింది సికందర్. దానికి కారణం నాని హిట్ 3 మూవీ ఓటీటీ టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవడమే. హిట్ 3 మూవీతో నెట్‌ఫ్లిక్స్ టాప్ 2 ప్లేస్‌లో సికందర్ మూవీ దంచికొడుతోంది. థియేటర్ టాక్ ఎలా ఉన్న నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ ఓటీటీ ట్రెండింగ్‌లో సత్తా చాటుతోంది.
సంబంధిత కథనం