Raashi Khanna Yodha: రాశీఖ‌న్నా బాలీవుడ్ రీఎంట్రీ ఆల‌స్యం - యోధ మూవీ మూడోసారి వాయిదా!-sidharth malhotra rashi khanna yodha movie gets postponed once again new release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raashi Khanna Yodha: రాశీఖ‌న్నా బాలీవుడ్ రీఎంట్రీ ఆల‌స్యం - యోధ మూవీ మూడోసారి వాయిదా!

Raashi Khanna Yodha: రాశీఖ‌న్నా బాలీవుడ్ రీఎంట్రీ ఆల‌స్యం - యోధ మూవీ మూడోసారి వాయిదా!

Raashi Khanna Yodha: రాశీఖ‌న్నా బాలీవుడ్ రీఎంట్రీ మూవీ యోధ మూడోసారి వాయిదా ప‌డింది. డిసెంబ‌ర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వ‌చ్చే ఏడాది మార్చికి పోస్ట్‌పోన్ చేశారు. యోధ‌ కొత్త రిలీజ్ డేట్‌ను హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్‌చేశాడు.

యోధ మూవీ

Raashi Khanna Yodha: యోధ మూవీతో దాదాపు పదకొండేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది రాశీఖ‌న్నా. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు సాగ‌ర్ ఆంబ్రే, పుష్క‌ర్ ఓజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల రెండుసార్లు రిలీజ్ పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా మూడోసారి ఈ సినిమా వాయిదాప‌డింది.

డిసెంబ‌ర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వ‌చ్చే ఏడాది మార్చి 15న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. యోధ కొత్త రిలీజ్ డేట్‌ను సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్‌చేశాడు. కాగా యోధ సినిమాలో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతోనే దాదాపు ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత రాశీఖ‌న్నా బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది.

2013లో రిలీజైన బాలీవుడ్ మూవీ మ‌ద్రాస్ కేఫ్ తో రాశీఖ‌న్నా సినీ ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. ఈ డెబ్యూ మూవీ త‌ర్వాత టాలీవుడ్‌లో బిజీ అయిన రాశీఖ‌న్నా బాలీవుడ్‌కు పూర్తిగా దూర‌మైంది. యోధ త‌ర్వాత లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌బోతుంది.

2022 మార్చిలోనే యోధ సినిమాలో త‌న పాత్ర‌కు సంబంధించిన సీన్స్‌ను రాశీఖ‌న్నా పూర్తిచేసింది. సినిమా ప‌లుమార్లు వాయిదాప‌డ‌టంతో ఆమె రీఎంట్రీ ఆల‌స్యం అవుతోంది. యోధ సినిమాలో రాశీఖ‌న్నాతో పాటు దిశా ప‌టానీ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తోన్నారు.