Sidharth Malhotra Kiara Advani Wedding: కియారా కోడలిగా రానుండటం ఆనందంగా ఉంది -ప్రశంసలు కురిపించిన సిద్ధార్థ్ తల్లి
Sidharth Malhotra Kiara Advani Wedding: బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మంగళవారం పెళ్లిపీటలెక్కబోతున్నారు. వీరి పెళ్లిపై సిద్ధార్థ్ మల్హోత్రా తల్లి రీమా మల్హోత్రా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Sidharth Malhotra Kiara Advani Wedding: బాలీవుడ్ ప్రేమ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మంగళవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ హోటల్‌లో సిద్ధార్థ్, కియారా వివాహం జరుగనుంది. ఈ పెళ్లి వేడుక కోసం సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు కియారా అద్వానీ కుటుంబసభ్యులు ఆదివారమే జైసల్మేర్ చేరుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
జైసల్మేర్ ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ మీడియాకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కియారా అద్వానీ తమ ఇంట కోడలిగా అడుగుపెట్టబోతుండటం ఆనందంగా ఉందని సిద్ధార్థ్ మల్హోత్రా మదర్ రీమా మల్హోత్రా చెప్పింది. కియారా మెడలో సిద్ధార్థ్ మూడు ముళ్లు వేసే క్షణం కోసం తాము ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
ఈ సంతోష సమయంలో మాటలు రావడం లేదని తెలిపింది. పెళ్లికి సంబంధించిన అన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నది. సిద్ధార్థ్, కియారా పెళ్లిపై రిమా చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాలను ఆకట్టుకుంటున్నాయి.
పెళ్లి డేట్ మారిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ ఫిబ్రవరి 6న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే 6వ తేదీన కాకుండా పెళ్లి 7వ తేదీన ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం అతిథులు కోసం గ్రాండ్ గెస్ట్ పార్టీని సిద్ధార్థ్, కియారా ఏర్పాటుచేసినట్లు సమాచారం.
సంగీత్ ఈవెంట్‌లో బాలీవుడ్‌లోని సూపర్ హిట్ సాంగ్స్‌కు సిద్ధార్థ్, కియారాతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ డ్యాన్స్ చేయబోతున్నట్లు తెలిసింది. గత నాలుగేళ్లుగా సిద్ధార్థ్, కియారా ప్రేమలో ఉన్నారు.
2019లో విడుదలైన షేర్‌షా సినిమాలో తొలిసారి జంటగా నటించారు సిద్ధార్థ్, కియారా. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిమధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నది.