Sidharth Kiara Wedding: మరో బాలీవుడ్ జంట పెళ్లితో ఒక్కటైంది. గతేడాది రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి ఏ స్థాయిలో వార్తల్లో నిలిచిందో ఇప్పుడు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి కూడా అదే స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. చాన్నాళ్లుగా ఈ జంట డేటింగ్ లో ఉన్నా, పెళ్లి వార్తలు వచ్చినా.. ఎప్పుడూ పబ్లిగ్గా చెప్పలేదు.,అయితే ముందుగా అనుకున్నట్లే మొత్తానికి మంగళవారం (ఫిబ్రవరి 7) వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. గత మూడు రోజులుగా మెహందీ, సంగీత్, హల్దీ కార్యక్రమాలు జరిగాయి. నిజానికి సోమవారమే పెళ్లి జరుగుతుందని భావించారు. కానీ అది కాస్తా మంగళవారానికి వాయిదా పడింది.,వీళ్ల పెళ్లికి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా రాజస్థాన్ కు పెళ్లి బ్యాండ్ ఒకటి వెళ్లింది. పెళ్లి వేదిక బయటకు గుర్రాన్ని తీసుకొస్తున్న ఈ బ్యాండ్ కు సంబంధించిన వ్యక్తి పెళ్లి జరిగిపోయిందని చెప్పాడు. అంతకుముందు బారాత్ కూడా ధూమ్ దామ్ గా నిర్వహించారు. తెల్లటి గుర్రంపై సిద్ధార్థ్ పెళ్లి వేదిక దగ్గరికి వచ్చాడు. ఈ పెళ్లికి కియారా పింక్ లెహెంగా ధరించింది.,ఇక పెళ్లి బారాత్ లో బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు. కియారా, సిద్ధార్థ్ పెళ్లి జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో జరిగింది. వీళ్ల పెళ్లికి కరణ్ జోహార్ తోపాటు షాహిద్ కపూర్, ఇషా అంబానీ, జూహీ చావ్లాలాంటి సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.,2021లో షేర్షా మూవీ చేస్తున్న సమయంలో కియారా, సిద్ధార్థ్ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచీ వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. అయితే పెళ్లి విషయంలో మాత్రం వీళ్లు చివరి వరకూ సీక్రెట్ గానే ఉన్నారు. కియారా ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఆర్సీ15లో నటిస్తున్న విషయం తెలిసిందే.,