ఓటీటీలోకి సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో..-siddu jonnalagadda spy action comedy movie jack will be steaming on netflix ott from may 8 jack ott release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో..

ఓటీటీలోకి సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో..

జాక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఐదు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది.

అఫీషియల్: సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మంచి హైప్ మధ్య ఏప్రిల్ 10న విడుదలైన ఈ స్పై యాక్షన్ కామెడీ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ జాక్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు అధికారికంగా ఖరారైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

జాక్ సినిమా మే 8వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. థియేటర్లలో తెలుగులో ఒక్కటే రిలీజైన ఈ సినిమా ఓటీటీలో ఐదు భాషల్లో వస్తోంది.

జాక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‍ను నెట్‍ఫ్లిక్స్ నేడు (మే 5) అధికారికంగా ప్రకటించింది. “పాబ్లో నెరూడా.. పేరు పొయిటిక్‍గా ఉన్నా ప్రొఫెషన్ మాత్రం కాన్ఫిడెన్షియల్. జాక్ చిత్రాన్ని మే 8 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చూసేయండి” అని నెట్‍ఫ్లిక్స్ నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

బాక్సాఫీస్ నిరాశ

జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ముందు నుంచి మిక్స్డ్ టాక్ రావటంతో కలెక్షన్లు అనుకున్న రేంజ్‍లో రాలేదు. ఈ చిత్రం సుమారు రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ.9కోట్ల గ్రాస్ కలెక్షన్లనే సాధించింది. దీంతో డిజాస్టర్ రిజల్ట్ దక్కించుకుంది. టిల్లు చిత్రాలతో జోష్ మీద ఉన్న సిద్ధుకు జాక్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు ప్రమోషన్లను మూవీ టీమ్ బాగానే చేసింది. కానీ ప్లాఫ్ తప్పలేదు.

స్పై ఏజెంట్‍గా సిద్ధు

జాక్ సినిమాలో సిద్ధుకు జోడీగా వైష్ణవి చైతన్య నటించారు. ఈ మూవీలో సిద్దు ఓ స్పై ఏజెంట్ పాత్ర పోషించారు. ప్రకాశ్ రాజ్, వీకే నరేశ్, బ్రహ్మజీ, రవిప్రకాశ్ కీరోల్స్ చేశారు. ఉగ్రవాదులను పట్టుకునే మిషన్ చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. లవ్ స్టోరీ, కామెడీ కూడా ఉంటాయి. ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించలేకపోయారు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. స్టోరీ నుంచి నరేషన్ వరకు మిశ్రమ స్పందన దక్కింది. ఈ చిత్రంతో భాస్కర్ మళ్లీ ట్రాక్‍లోకి వస్తారని పెట్టుకున్న అంచనాలు తలకిందులు అయ్యాయి.

జాక్ సినిమాను ఎస్‍వీసీసీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా.. బాపినీడు సమర్పించారు. ఈ మూవీకి అచ్చు రాజమణి, సామ్ సీఎస్ సంగీత దర్శకులుగా పని చేశారు. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ చేసిన చేసిన ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం