థియేటర్లలో డిజాస్టర్.. కానీ ఓటీటీలో దుమ్మురేపుతున్న సిద్ధు జొన్నలగడ్డ మూవీ.. ట్రెండింగ్ లో!-siddu jonnalagadda movie jack trending top 2 in netflix disaster result in theatres ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  థియేటర్లలో డిజాస్టర్.. కానీ ఓటీటీలో దుమ్మురేపుతున్న సిద్ధు జొన్నలగడ్డ మూవీ.. ట్రెండింగ్ లో!

థియేటర్లలో డిజాస్టర్.. కానీ ఓటీటీలో దుమ్మురేపుతున్న సిద్ధు జొన్నలగడ్డ మూవీ.. ట్రెండింగ్ లో!

థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలిన సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ ఫిల్మ్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. జాక్ సినిమా ఓటీటీలో సత్తాచాటుతోంది. ట్రెండింగ్ టాప్-2లో కొనసాగుతోంది.

ఓటీటీలో అదరగొడుతున్న సిద్ధు మూవీ (x/SVCCofficial)

థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకుని, డిజాస్టర్లుగా మిగిలిన సినిమాలు ఓటీటీలో సత్తాచాటడం తెలిసిందే. ఓటీటీలో మూవీస్ వ్యూస్ కు థియేటర్ల రిజల్ట్ తో సంబంధం లేదనే చెప్పొచ్చు. ఇప్పుడు థియేటర్లలో డిజాస్టర్ అయిన సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ ఫిల్మ్ ‘జాక్’ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది.

టాప్-2 ట్రెండింగ్

సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘జాక్’ థియేటర్లలో తీవ్రంగా నిరాశపర్చింది. కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ లో టాప్-2లో కొనసాగుతోంది. ఈ విషయాన్ని జాక్ మూవీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎక్స్ లో పోస్టు చేసింది.

షాకింగ్ రిజల్ట్

డీజే టిల్లూ మూవీస్ తో జోరుమీదున్న సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా అనగానే జాక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా సిద్ధుతో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జత కట్టడంతో ఇది క్రేజీ కాంబినేషన్ గా నిలిచింది. స్పై కామెడీ థ్రిల్లర్ గా ఈ మూవీని రెడీ చేశారు. కానీ ఏప్రిల్ 10న థియేటర్లకు వచ్చిన జాక్ కు షాకింగ్ రిజల్ట్ ఎదురైంది. ఫస్ట్ డే నుంచే డివైడ్ టాక్ వినిపించింది. అది కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించింది.

రూ.25 కోట్ల నష్టం

జాక్ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సుమారు రూ.40 కోట్ల బడ్డెట్ తో మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి రూ.17 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా 850 స్క్రీన్లలో రిలీజైన జాక్ మూవీ చివరకు రూ.9 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. దీంతో ఈ మూవీ రూ.25 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

నెల రోజుల్లోపే

థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన జాక్ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్-2 ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, రవి ప్రకాష్ కీ రోల్స్ ప్లే చేశారు.

మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జాక్ స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ గా నిలిచినా ఓటీటీలో మాాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీ లవర్స్ పుణ్యామా అని ట్రెండింగ్ లో టాప్-2లోకి దూసుకొచ్చింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం