Siddu Jonnalagadda: ఆ బాధ నాకు ఎప్పుడు ఉండేది.. రానాకు చెబితే తక్కువ టైమ్‌లో ప్లాన్ చేశాడు.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్
Siddu Jonnalagadda About Its Complicated And Rana Daggubati: ఓటీటీలో నేరుగా రిలీజ్ అయిన సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీని ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్‌తో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చాడు.

Siddu Jonnalagadda About Its Complicated And Rana Daggubati: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిజ్ లీలా. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఆహా ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్‌స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీపై ఒక రిఫ్రెషింగ్ టేక్‌గా పేరు తెచ్చుకుంది.
ఫిబ్రవరి 14న కొత్త టైటిల్‌తో
కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. అయితే, ఇప్పుడు రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే విడుదలైన కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రం ఫిబ్రవరి 14న కొత్త టైటిల్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను 'ఇట్స్ కాంప్లికేటెడ్'గా మార్చారు.
ఇప్పుడు పర్ఫెక్ట్ యాప్ట్
ఈ కొత్త టైటిల్ మరింత ఆసక్తిని జోడించడమే కాకుండా, సినిమా కంటెంట్‌కి పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయింది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో వైరల్ అయింది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చాడు.
ఎన్నో విషయాలు నేర్చుకున్నా
ఇట్స్ కాంప్లికేటెడ్ ప్రెస్ మీట్‌లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమా నాకు చాలా స్పెషల్. పాండమిక్ కారణంగా థియేటర్స్‌లో రిలీజ్ కాలేదు. ఈ సినిమాని థియేటర్స్‌లో చూస్తే ఎలాంటి రెస్పాన్స్ వచ్చేదో అనే ఆసక్తి ఉండేది. ఈ మూవీ జర్నీలో నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. రవితో కొలాబరేషన్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది" అని అన్నాడు.
రీ రిలీజ్ కోరుతూ మెసేజ్ చేసేవారు
"ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయలేకపోయమన్న బాధ నాకు, రవికాంత్‌కు ఎప్పుడూ ఉండేది. ఈ మూవీ రీ రిలీజ్ కోరుతూ అభిమానులు కొందరు రవికాంత్‌కు సోషల్ మీడియాలో మెసేజ్ చేసేవారు. వాటిని చూశాక.. నాకూ ఈ సినిమాని థియేటర్స్‌కి తీసుకొస్తే బాగుంటుందనిపించింది. రానాకు చెబితే తక్కువ సమయంలోనే రిలీజ్ ప్లాన్ చేశారు" అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపాడు.
ఇంకా రిలవెంట్ అనిపిస్తోంది
"థియేటర్స్‌లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చుడాలనే ఎగ్జయిట్‌మెంట్ ఉంది. అప్పటి కంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకా రిలవెంట్ అనిపిస్తోంది" అని స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వెల్లడించాడు.
రానా గారే ఇలాంటివి నిర్మించగలరు
డైరెక్టర్ రవికాంత్ పెరెపు మాట్లాడుతూ.. "ఇట్స్ కాంప్లికేటెడ్ థియేటర్స్‌లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. సిద్దు ఈ సినిమాకి బిగ్గెస్ట్ సపోర్ట్. కేవలం రానా గారే ఇలాంటి సినిమాలని నిర్మించగలరు. ఈ సినిమా జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం