Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? - నెలలోపే బ్లాక్‌బస్టర్ మూవీ స్ట్రీమింగ్
Tillu Square OTT: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా థియేటర్లలలో రిలీజైన నెలలోపే టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.

సిద్ధు, అనుపమ కెమిస్ట్రీ...
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, అనుపమతో అతడి కెమిస్ట్రీ అభిమానులతో ఆకట్టుకుంటోన్నాయి. ఇప్పటివరకు తెలుగులో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్‌లో కంప్లీట్ బోల్డ్ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. సిద్ధు పంచ్ డైలాగ్స్ హిలేరియస్‌గా థియేటర్లలో నవ్విస్తున్నాయి.
నెల రోజుల్లోనే ఓటీటీలోకి...
కాగా టిల్లు స్వ్కేర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఫ్యానీ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డేట్‌ను దాదాపుగా నెట్‌ఫ్లిక్స్ కన్ఫామ్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. త్వరలోనే టిల్లు స్వ్కేర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్నట్లు సమాచారం.
సిద్దు జొన్నలగడ్డ కథ, స్క్రీన్‌ప్లే...
టిల్లు స్క్వేర్ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సీక్వెల్ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ కథతో పాటు స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. 2022లో రిలీజై కమర్షియల్ హిట్‌గా నిలిచిన డీజే టిల్లుకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ రూపొందింది. డీజే టిల్లులో హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టి టిల్లు స్క్వేర్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించింది. టిల్లు ఫ్రాంచైజ్‌లో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతోంది. ఈ థర్డ్ పార్ట్‌కు టిల్లు క్యూబ్ అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టిల్లు పార్ట్ 3లో సిద్ధు జొన్నలగడ్డ సూపర్ హీరోగా కనిపించనున్నట్లు సమాచారం.
టిల్లు స్క్వేర్ కథ ఇదే...
రాధిక (నేహా శెట్టి) కారణంగా జరిగిన గొడవలను మర్చిపోయిఈవెంట్ మేనేజర్ సెటిలైపోతాడు డీజే టిల్లు. అతడి జీవితంలోకి మరో అమ్మాయి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్)అడుగుపెడుతుంది. ఓ పార్టీలో పరిచయమైన లిల్లీతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు టిల్లు.
ఒక్కరోజు పరిచయంలోనే ఇద్దరు కమిట్ అవుతారు. ఆ తర్వాత రోజు నుంచి లిల్లీ కనిపించకుండా పోతుంది. నెల తర్వాత కనిపించిన లిల్లీ తాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. తనకు పుట్టబోయే బిడ్డకు టిల్లునే తండ్రి అని, తనను పెళ్లిచేసుకోవాలని పట్టుపడుతుంది. లిల్లీ కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? టిల్లు ఆమెను పెళ్లిచేసుకున్నాడా? రాధిక ఫ్లాట్‌తో లిల్లీకి ఉన్న సంబంధం ఏమిటి? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్‌ను చంపేందుకు వేసిన ప్లాన్‌లోకి టిల్లు ఎలా వచ్చాడు? లిల్లీ కారణంగా టిల్లు జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి? అన్నదే టిల్లు స్వ్కేర్ కథ.
టిల్లు స్క్వేర్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలోని పాటలను రామ్ మిరియాలా, అచ్చు కంపోజ్ చేయగా...భీమ్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.