Siddhu Jonnalagadda Comments In Jack Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘జాక్ - కొంచెం క్రాక్’. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మించింది.
జాక్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. జాక్ మూవీ ఇవాళ (ఏప్రిల్ 10) ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే పలు చోట్ల జాక్ మూవీ ప్రీమియర్ షోలు పడగా సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. అయితే, విడుదలకు ముందు జరిగిన జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "జాక్ ఈవెంట్‌కు వచ్చిన చందూ మొండేటి, కార్తీక్, కల్యాణ్ శంకర్‌కి థాంక్స్. విరూపాక్ష నన్ను చాలా భయపెట్టింది. చందూ మొండేటి నాకు ఓ సినిమా బ్యాలెన్స్ (బాకీ) ఉన్నారు. కల్యాణ్ శంకర్ నాకు చాలా మంచి ఫ్రెండ్. నాగవంశీ అన్న వచ్చి సపోర్ట్ చేసినందుకు థాంక్స్" అని అన్నాడు.
"టిల్లు స్క్వేర్ తరువాత ఎలాంటి కథ చేయాలని చాలా ఆలోచించాను. అదే మీటర్‌లో ఉండాలి కానీ.. సేమ్ స్టోరీలా ఉండొద్దని అనుకున్నాను. ఆ టైంలోనే జాక్ కథను విన్నాను. టిల్లు స్క్వేర్ తరువాత ఇదే పర్ఫెక్ట్ సినిమా అని నాకు అనిపించింది. మా సినిమా కోసం అచ్చు, సురేష్ బొబ్బిలి పాటలు చక్కగా ఇచ్చారు. శామ్ సీఎస్, వైదీ ఈ చిత్రానికి మంచి ఆర్ఆర్ ఇచ్చారు" అని సిద్ధు జొన్నలగడ్డ తెలిపాడు.
"నవీన్ నూలి ఎడిటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఓ ఎడిటర్ లేకుంటే డైరెక్టర్లకు కాళ్లు, చేతులు ఆడవు. జాక్ చిత్రాన్ని ఆయన చక్కగా కట్ చేశారు. వైష్ణవి ఏవీ చూసినప్పుడు నాకు కూడా గూస్ బంప్స్ వచ్చాయి. బేబీ చూసిన తరువాత జాక్ హీరోయిన్ ఈమే అని ఫిక్స్ అయ్యాం. వైష్ణవి చాలా గొప్ప నటి. మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను" అని సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు.
"బొమ్మరిల్లు భాస్కర్ గారితో ఆరెంజ్ సినిమాను చేశాను. కానీ, ఆ టైంలో ఎక్కువగా మాట్లాడే టైం దొరకలేదు. ఈ జాక్ కోసం ఆయనతో చాలా ట్రావెల్ చేశాను. ఆయన 24 గంటలు సినిమా కోసమే ఆలోచిస్తుంటారు. టిల్లు, టిల్లు స్క్వేర్‌తో నాకు ఓ కామెడీ టైమింగ్ ఏర్పడింది. ఆ టైమింగ్‌ను జాక్‌లో మిస్ అవ్వకుండా చేశారు బొమ్మరిల్లు భాస్కర్" అని పేర్కొన్నాడు సిద్ధు జొన్నలగడ్డ.
"నాకు జాక్ చిత్రంలో ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. అంతలా నన్ను సపోర్ట్ చేసిన ఆయనకు థాంక్స్. విజయ్ చక్రవర్తి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. అవినాష్ గారి ఆర్ట్ వర్క్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. జాక్ చిత్రం రెండు వందల శాతం అందరికీ నచ్చుతుంది. ఎక్కడా కూడా ఎవ్వరినీ నిరాశపర్చదు. జాక్ సినిమాను అందరూ చూడండి" అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తన స్పీచ్ ముగించాడు.
సంబంధిత కథనం