Siddharth: అమ్మాయిల నడుము గిల్లే, వాళ్లను కొట్టే సినిమాలు చేయనని చెప్పాను: సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-siddharth says he rejected movies where he had to pinch naval of heroines and slap them ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddharth: అమ్మాయిల నడుము గిల్లే, వాళ్లను కొట్టే సినిమాలు చేయనని చెప్పాను: సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddharth: అమ్మాయిల నడుము గిల్లే, వాళ్లను కొట్టే సినిమాలు చేయనని చెప్పాను: సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Jan 28, 2025 05:48 PM IST

Siddharth: నటుడు సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అమ్మాయిల నడుములు గిల్లే, వాళ్లను చెంపదెబ్బ కొట్టే సీన్లు ఉన్న సినిమాలను తాను నిరాకరించానని, అవి కూడా చేసి ఉంటే తాను మరింత పెద్ద స్టార్ అయి ఉండేవాడినని అతడు అనడం విశేషం.

అమ్మాయిల నడుము గిల్లే, వాళ్లను కొట్టే సినిమాలు చేయనని చెప్పాను: సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అమ్మాయిల నడుము గిల్లే, వాళ్లను కొట్టే సినిమాలు చేయనని చెప్పాను: సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddharth: తమిళంతోపాటు తెలుగు సినిమాల్లోనూ నటించి పేరు సంపాదించిన నటుడు సిద్ధార్థ్ ఈ మధ్యే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన సినిమాలు, తాను చదవిని పుస్తకాల గురించి అతడు చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్లో తన భార్య అదితి రావ్ హైదరీ తల్లి విద్యా రావుతో అతడు మాట్లాడటం విశేషం. సినిమాల్లో తాను అమ్మాయిలను వేధించే బ్యాడ్ బాయ్ పాత్రలను ఎలా తిరస్కరించానో చెప్పాడు.

yearly horoscope entry point

అమ్మాయిల నడుము గిల్లే సీన్లు చేయనన్నాను: సిద్ధార్థ్

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో నటుడు సిద్ధార్థ్ ఆడియెన్స్ తోనూ ముచ్చటించాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. తాను కొన్ని సినిమాలకు ఓకే చెప్పి ఉంటే మరింత పెద్ద స్టార్ అయి ఉండేవాడినని గుర్తు చేసుకున్నాడు.

"అమ్మాయిల నడుములు గిల్లడం, వాళ్లను కొట్టడం, ఐటెమ్ సాంగ్స్ చేయడం, అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్లాలో చెప్పడంలాంటి స్క్రిప్ట్ లు నాకు వచ్చేవి. ఒకవేళ ఆ మూవీస్ స్క్రిప్ట్స్ బాగుంటే సినిమాలు పెద్ద హిట్ అయ్యేవి. కానీ వాటిని నేను తిరస్కరించాను. ఒకవేళ నేను అలాంటివి చేసి ఉంటే మరింత పెద్ద స్టార్ ని అయి ఉండేవాడిని. నాకు ఇష్టమైనవి మాత్రమే నేను చేశాను" అని సిద్ధార్థ్ వెల్లడించాడు.

అదే నాకు సంతృప్తినిచ్చేది

తన కెరీర్లో ఎంతో తన గురించి మంచిగా మాట్లాడటం తనకు ఎంతో సంతృప్తినిచ్చే విషయమని సిద్ధార్థ్ అన్నాడు. "నేను మహిళలను ఎంతలా గౌరవించేవాడినో, తల్లిదండ్రులతో ఎంత బాగా ఉండేవాడినో, ఎంత క్యూట్ గా కనిపించే వాడినో ఈ రోజు నాతో కొందరు చెబుతుంటారు.

వాళ్ల పిల్లలు కూడా 15 ఏళ్ల కిందటి నా సినిమాలు చూస్తుంటారు. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చే విషయం. దీనిని కోట్లలో వెలకట్టలేం. నా చుట్టూ ఉన్న హీరోలు ఎంతో దూకుడుగా, మాచోగా కనిపించేవారు. మర్ద్ కో దర్ద్ నహీ హోతా (మగాళ్లకు అసలు బాధ ఉండదు) అనే రకం వ్యక్తులు. నేను మాత్రం స్క్రీన్ పై ఏడవడానికి కూడా సిగ్గుపడేవాడిని కాదు" అని సిద్ధార్థ్ అన్నాడు.

ఈ స్టార్ హీరో ఒకప్పుడు బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రంగ్ దే బసంతిలాంటి సినిమాలతో తెలుగు, తమిళ, హిందీ సినిమా రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ఇండియన్ 2 మూవీలో నటించాడు. అంతకుముందు చిన్నా అనే మరో సినిమాతోనూ వచ్చినా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఇండియన్ 3, టెస్ట్ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం