Siddharth Roy OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న సిద్ధార్థ్ రాయ్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-siddharth roy ott release date deepak saroj romantic movie streaming on amazon prime video on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddharth Roy Ott: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న సిద్ధార్థ్ రాయ్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Siddharth Roy OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న సిద్ధార్థ్ రాయ్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 20, 2024 01:50 PM IST

Siddharth Roy OTT: సిద్ధార్థ్ రాయ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తోంది. దీప‌క్ స‌రోజ్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీకి య‌శ‌స్వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ

Siddharth Roy OTT: టాలీవుడ్ లేటెస్ట్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకోన్న‌ట్లు స‌మాచారం. మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిద్ధార్థ్ రాయ్ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

yearly horoscope entry point

దీప‌క్ స‌రోజ్‌...

సిద్ధార్థ్ రాయ్ మూవీతో హీరోగా దీప‌క్ స‌రోజ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌చార చిత్రాల‌తో ఈ మూవీ అర్జున్‌రెడ్డి, యానిమ‌ల్ సినిమాల‌ను గుర్తుచేసింది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్, బాడీలాంగ్వేజ్ యారోగెంట్‌గా క‌నిపించ‌డంతో సిద్ధార్థ్ రాయ్ మూవీపై తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. కానీ ఆ క్యూరియాసిటీని నిల‌బెట్ట‌డంతో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యారు. ప్రేమ‌క‌థ‌ను కొత్త‌గా చెప్ప‌డంలో త‌డ‌బాటుకు లోన‌వ్వ‌డంతో సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిల‌వ‌లేక‌పోయింది. కొన్ని లాజిక్స్ మిస్స‌వ్వ‌డం కూడా సినిమా ఫెయిల్యూర్‌కు కార‌ణ‌మైంది.

సిద్ధార్థ్ రాయ్ క‌థ ఇదే...

సిద్ధార్ రాయ్ లాజిక్ ప్ర‌కార‌మే లైఫ్‌ను కొన‌సాగిస్తుంటాడు. ఎలాంటి ఎమోష‌న్స్ లేకుండా త‌న అవ‌స‌రాలు తీర్చుకుంటూ సంతోషంగా లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. ఇందు అనే అమ్మాయి ప‌రిచ‌యంతో సిద్ధార్థ్ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? సిద్ధార్థ్‌ను ప్రాణంగా ప్రేమించిన ఇందు అత‌డికి ఎందుకు బ్రేక‌ప్ చెప్పింది అన్న‌దే ఈ మూవీ క‌థ. చాలా ప్రాక్టిక‌ల్‌గా బ‌తికే ఓ యువ‌కుడు ప్రేమ‌, బంధాల విలువ ఎలా తెలుసుకున్నాడ‌నే పాయింట్ ద‌ర్శ‌కుడు బాగా రాసుకున్నా అర్థ‌వంతంగా చెప్ప‌డంలో త‌డ‌బాటుకు లోన‌య్యాడు.

బాల‌న‌టుడిగా...

హీరోగా దీప‌క్ స‌రోజ్‌కు ఇదే ఫ‌స్ట్ మూవీ. అత‌డి యాక్టింగ్ బాగుంద‌నే కామెంట్స్ వ‌చ్చాయి. గ‌తంలో బాల‌న‌టుడిగా అత‌డు, లెజెండ్‌తో పాటు తెలుగు సినిమాలు చేశాడు దీప‌క్ స‌రోజ్‌. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మిణుగురులు సినిమాకుగాను నంది అవార్డును అందుకున్నాడు.

సిద్ధార్థ్ రాయ్ మూవీలో త‌న్వినేగి హీరోయిన్‌గా న‌టించింది. య‌శ‌స్వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గౌత‌మ‌బుద్దుడి జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ ద‌ర్శ‌కుడు ఈ మూవీ క‌థ‌ను రాసుకున్నాడు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా బోల్డ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సిద్ధార్థ్ రాయ్‌ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ ర‌థ‌న్ మ్యూజిక్ అందించాడు. థియేట‌ర్ల‌లో సిద్ధార్థ్ రాయ్ మూవీ ఫిబ్ర‌వ‌రి 23న రిలీజైంది.

సిద్ధార్థ్ రాయ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తోంది. దీప‌క్ స‌రోజ్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీకి య‌శ‌స్వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Whats_app_banner