OTT Romantic Comedy: సిద్ధార్థ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
OTT Romantic Comedy: సిద్ధార్థ్ నటించిన మిస్ యూ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఏదో సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
హీరో సిద్ధార్థ్‌కు సరైన హిట్ లేక చాలా ఏళ్లే గడిచింది. గతేడాది చిత్తా (తెలుగులో చిన్నా) సినిమాతో ప్రశంసలను దక్కించుకున్నా కమర్షియల్‍గా పెద్దగా సక్సెస్ కాలేదు. కొన్ని సంవత్సరాలుగా ఆయనకు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. సిద్ధార్థ్ హీరోగా డిసెంబర్ 13వ తేదీన మిస్‍యూ సినిమా విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ అయింది.
మిస్ యూ చిత్రం రిలీజ్‍కు ముందు పెద్దగా బజ్ తెచ్చుకోలేకపోయింది. విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ రావటంతో కలెక్షన్లను పెద్దగా రాబట్టలేకపోయింది. సిద్ధార్థ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఆ వివరాలివే..
ఈ ప్లాట్‍ఫామ్‍లోనే..
మిస్ యూ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి చివరి వారంలో స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై బజ్ నడుస్తోంది. స్ట్రీమింగ్ తేదీపై ప్రైమ్ వీడియో ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మిస్ యూ చిత్రంలో సిద్ధార్థ్ సరసన హీరోయిన్‍గా అషికా రంగనాథ్ నటించారు. కరుణాకరన్, బాల శరవణన్, సస్తిక, లొల్లుసభ మారన్, బాల, జయప్రకాశ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లవ్ స్టోరీ, కామెడీ మేళవింపుతో డైరెక్టర్ రాజశేఖర్ తెరకెక్కించారు. ప్రమాదం వల్ల మెమరీ లాస్ అయిన ఓ వ్యక్తి లవ్ స్టోరీ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమాకు ఆరంభం నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.
కలెక్షనల్లో డీలా
మిస్ యూ చిత్రానికి కలెక్షన్లు పేలవంగానే వచ్చాయి. ఈ చిత్రం సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.4.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. దాదాపు థియేట్రికల్ రన్ కూడా పూర్తి కావొస్తోంది. దీంతో బడ్జెట్‍లో సగం వసూళ్లను కూడా మిస్ యూ సాధించడం కష్టంగా కనిపిస్తోంది. సిద్ధార్థ్‌కు మరో బాక్సాఫీస్ డిజాస్టర్ ఎదురైనట్టే.
మిస్ యూ మూవీని సెవెన్ మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్ పతాకంపై శ్యాముయేల్ మాథ్యూ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ ఇవ్వగా.. కేజీ వెంకటేశ్ సినిమాటోగ్రఫీ చేశారు.
మిస్ యూ స్టోరీలైన్
యువ సినీ దర్శకుడిగా ఉండే వాసు (సిద్ధార్థ్)కు ప్రమాదం జరుగుతుంది. దీంతో గత రెండేళ్ల మెమరీని మర్చిపోతాడు. ఆ తర్వాత బెంగళూరుకు వెళతాడు వాసు. అక్కడ సుబ్బు అలియాజ్ సుబ్బలక్ష్మి (అషికా రంగనాథ్)ను చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమను సుబ్బుకు చెబుతాడు వాసు. కానీ ఆమె అంగీకరించదు. సుబ్బుతో తనకు ఎలాగైనా పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులకు చెబుతాడు వాసు. అప్పుడే ఓ భారీ ట్విస్ట్ ఎదురవుతుంది. తన గతం గురించి ఓ అనూహ్యమైన విషయం వాసుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ షాకింగ్ విషయం ఏంటి.. వాసుకు సుబ్బుకు ముందే తెలుసా అనేవి మిస్ యూ చిత్రంలో ప్రధానమైన విషయాలుగా ఉంటాయి.
సంబంధిత కథనం