OTT: నేరుగా ఓటీటీలోకి సిద్ధార్థ్, నయనతార మూవీ.. మాధవన్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ కొత్త టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT: టెస్ట్ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా నుంచి తాజాగా మరో టీజర్ అడుగుపెట్టింది. మాధవన్ పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్ వచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇప్పటికే ఖరారైంది.
టెస్ట్ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. సిద్ధార్థ్, నయనతార, మాధవన్ లాంటి స్టార్ యాక్టర్స్ కలిసి ఈ మూవీలో నటించారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇది కూడా ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంపై క్యూరియాసిటీ మరింత పెంచింది. క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం సాగుతుంది. టెస్ట్ చిత్రం నుంచి మాధవన్ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ తాజాగా ఓ టీజర్ తీసుకొచ్చారు మేకర్స్.
సవాళ్లను ఎదుర్కొనే సైంటిస్ట్‌గా మాధవన్
టెస్ట్ చిత్రంలో సైంటిస్ట్ శవరణన్ పాత్రను మాధవన్ పోషిస్తున్నారని కొత్త టీజర్ ద్వారా రివీల్ అయింది. ఫ్యుయల్ సెల్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణను శరవణ్ (మాధవన్) చేసి ఉంటాడు. అయితే, దానికి అనుమతి పొందేందుకు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటాడు. కొందరు డబ్బు కూడా అడుగుతారు. దీంతో తన కలను సాకారం చేసుకునేందుకు అనేక కష్టాలను శరవణన్ పడతాడు. సవాళ్లను ఎదుర్కొంటాడు. కానీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇలా ఈ కొత్త టీజర్ ఉంది. ఈ టీజర్‌ను తమిళ స్టార్ హీరో సూర్య రివీల్ చేశారు.
టెస్ట్ చిత్రంలో భారత క్రికెటర్ అర్జున్ పాత్రలో సిద్ధార్థ్ నటించారు. గత రెండు సీజన్లు సరిగా ఆడకపోవటంతో జట్టులో చోటు కోల్పోతాడు. రిటైర్ అవ్వాలంటూ అతడికి కొందరు సలహా ఇస్తుంటారు. అయితే, ఇండియాను గెలిపించేందుకు తనకు మరిన్ని అవకాశాలు రావాలని అర్జున్ అనుకుంటాడు. విమర్శల మధ్యే అతడు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తాడు. మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడా అనే ప్రశ్నను సిద్ధార్థ్ క్యారెక్టట్ టీజర్ మిగిల్చింది. టెస్ట్ సినిమాలో గృహిణిగా, టీచర్‌గా నటించారు నయనతార. కుముద పాత్ర పోషించారు.
టెస్ట్ మూవీకి శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీరా జాస్మిన్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. వైనాట్ స్టూడియోస్ పతాకంపై రామచంద్ర, శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ గతేడాదే పూర్తయింది. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రానుంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
టెస్ట్ సినిమా ఏప్రిల్ 4వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‍కే మేకర్స్ తీసుకొచ్చేస్తున్నారు.
నెట్‍ఫ్లిక్స్‌లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ మార్చి 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. కుంచకో బోబన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో మలయాళంలో ఫిబ్రవరి 20వ తేదీన రిలీజై సూపర్ హిట్ అయింది. తెలుగులో మార్చి 14న విడుదలైంది. ఆ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ ఇప్పడు మార్చి 20న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో ప్రియమణి, జగదీశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి జీతూ అష్రఫ్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం