Romantic Comedy OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ - రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌!-siddharth ashika ranganath miss you movie streaming now on amazon prime video in telugu and tamil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Romantic Comedy Ott: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ - రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌!

Romantic Comedy OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ - రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌!

Nelki Naresh Kumar HT Telugu
Jan 10, 2025 09:45 AM IST

Romantic Comedy OTT: సిద్ధార్థ్ మిస్ యూ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించింది.

రొమాంటిక్ కామెడీ ఓటీటీ
రొమాంటిక్ కామెడీ ఓటీటీ

సిద్ధార్థ్ మిస్ యూ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌రోజుల్లోపే ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది. తెలుగు, త‌మిళం.... రెండు భాష‌ల్లో మిస్ యూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

yearly horoscope entry point

రొమాంటిక్ కామెడీ మూవీ...

రొమాంటిక్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన మిస్ యూ మూవీలో సిద్ధార్థ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించింది. ఎన్ రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సిద్ధార్థ్‌, ఆషికా రంగ‌నాథ్ కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ బాగున్నా...కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, బోరింగ్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా మిస్ యూ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

క‌లెక్ష‌న్స్‌...

దాదాపు ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన మిస్ యూ మూవీ ఆరు కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌నుతెచ్చిపెట్టింది. త‌మిళంలో మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ తెలుగులో మాత్రం దారుణంగా నిరాశ‌ప‌రిచింది. తెలుగులో వ‌చ్చిన హాయ్ నాన్న‌తో పాటు మ‌రికొన్ని సూప‌ర్ హిట్ సినిమాల‌ను క‌థ ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం కూడా మిస్ యూ మూవీకి మైన‌స్‌గా మారింది.

గ‌తం మ‌ర్చిపోతే...

వాసు (సిద్ధార్థ్‌) సినిమా డైరెక్ట‌ర్ కావాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. క‌ల నెర‌వేరుతోన్న టైమ్‌లోనే ఓ యాక్సిడెంట్ కార‌ణంగా అత‌డి జీవితం మొత్తం త‌ల‌క్రిందుల‌వుతుంది. సినిమా ప్ర‌య‌త్నాల్ని వ‌దిలిపెట్టి బెంగ‌ళూరులోని కేఫ్‌లో జాబ్ చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. అక్క‌డే అత‌డికి సుబ్బ‌ల‌క్ష్మి (ఆషికా రంగ‌నాథ్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. తొలిచూపులోనే సుబ్బ‌ల‌క్ష్మితో ప్రేమ‌లో ప‌డ‌తాడు వాసు.

త‌న ప్రేమ‌ను ఆమెకు వ్య‌క్తం చేస్తాడు. వాసు ప్ర‌పోజ‌ల్‌ను సుబ్బ‌ల‌క్ష్మి రిజెక్ట్ చేస్తుంది. వాసు త‌ల్లిదండ్రులు కూడా కొడుకు ప్రేమ‌కు అడ్డు చెబుతారు? అందుకు కార‌ణ‌మేమిటి? వాసుతో సుబ్బ‌ల‌క్ష్మికి గ‌తంలోనే ప‌రిచ‌యం ఉందా? యాక్సిడెంట్ కార‌ణంగా వాసు మ‌ర్చిపోయిన రెండేళ్ల‌లో అస‌లు ఏం జ‌రిగింది? సుబ్బ‌ల‌క్ష్మి, వాసు తిరిగి ఒక్క‌ట‌య్యారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఇండియ‌న్ 2 డిజాస్ట‌ర్‌..

కొన్నాళ్లుగా సిద్ధార్థ్ బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇండియ‌న్ 2 డిజాస్ట‌ర్‌గా నిలిచింది. మిస్ యూ కూడా అత‌డికి హిట్టు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. ఆషికా రంగ‌నాథ్ తెలుగులో అమిగోస్‌, నా సామిరంగ సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం చిరంజీవి విశ్వంభ‌ర‌లో కీల‌క పాత్ర పోషిస్తోంది.

Whats_app_banner