Maayon OTT: ఓటీటీలోకి వచ్చేసిన కట్టప్ప కొడుకు అడ్వెంచర్ థ్రిల్లర్.. బింబిసార తరహాలో మూవీ
Maayon OTT Release: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా కట్టప్పగా ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు నటుడు సత్యరాజ్. ఆయన కుమారుడు సిబి సత్యరాజ్ హీరోగా పరిచయమైన బింబిసార్ తరహా జోనర్ మూవీ మాయోన్ తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది.
బాహుబలి సినిమా ఫ్రాంచైజీ ద్వారా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు సత్యరాజ్. తెలుగులో ఆయన అనేక సినిమాలు చేసిన బాహుబలికి మాత్రం బీభత్సమైన క్రేజ్ వచ్చింది. ఇందులో కట్టప్పగా ఆయన అశేషంగా ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఆయన కుమారుడు సిబి సత్యరాజ్ (Sibiraj) హీరోగా పరిచయం అయిన సినిమా మాయోన్. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాయోన్ సినిమా గతేడాది జూన్ 24వ తేదిన విడుదలైంది. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. కానీ, ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది.
ట్రెండింగ్ వార్తలు
మైథలాజికల్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన మాయోన్ సినిమాలో శిబి సత్యరాజ్‍కు జోడీగా హీరోయిన్ తాన్య రవిచంద్రన్ నటించింది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. విజువల్ వండర్‍గా వచ్చిన ఈ సినిమా దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందని మర్చిపోయిన ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా మరోసారి పరిచయంలా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాయోన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. నెల క్రితం తమిళంలో స్ట్రీమింగ్ అయిన మాయోన్ ప్రస్తుతం తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి ఓ దేవాలయం మిస్టరీని చేధించే కథాంశంతో మాయోన్ తెరకెక్కింది. సినిమాలోని విజవల్స్, అడ్వెంచర్స్ చూస్తే కాస్తా అటు ఇటుగా బింబిసార తరహాలో ఉందని ఇప్పటికే ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కెమెరామెన్ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం హైలెట్ అని టాక్ వచ్చింది.
ఇదిలా ఉంటే మాయోన్ సినిమాలో సిబి సత్యరాజ్, తాన్య రవిచంద్రన్‌తోపాటు రాధా రవి, కేఎస్ రవి కుమార్, ఎస్ఏ చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్, హరీష్ పేరడి, అరాష్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మామిడాల శ్రీనివాస్, అరుణ్ మోజి మాణిక్యం నిర్మాతలుగా డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ బ్యానర్‍పై నిర్మించారు.