మూడు ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే.. ఉత్కంఠగా సాగే మూవీ-sibi sathyaraj tamil crime thriller movie ten hours now streaming on three otts amazon prime video tentkotta sunnxt ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మూడు ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే.. ఉత్కంఠగా సాగే మూవీ

మూడు ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే.. ఉత్కంఠగా సాగే మూవీ

టెన్ హవర్స్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఏకంగా మూడు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమా ఏ ప్లాట్‍ఫామ్‍ల్లోకి వచ్చిందంటే..

మూడు ఓటీటీల్లోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఉత్కంఠగా సాగే చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే..

ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒకే వారంలో మూడు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే ‘టెన్ హవర్స్’ సినిమా. ఏప్రిల్ 18వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సిబి సత్యరాజ్ హీరోగా నచించిన ఈ మూవీకి ఇళయరాజా కలియపెరుమాల్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రన్‍లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ టెన్ హవర్స్ సినిమా ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది.

స్ట్రీమింగ్ వివరాలివే..

టెన్ హవర్స్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్‍నెక్స్ట్, టెంట్‍కొట్టా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఇదే వారంలో మూడు ప్లాట్‍ఫామ్‍ల్లోకి అడుగుపెట్టింది. ఆ ఓటీటీల్లో ఈ చిత్రాన్ని చూసేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు కన్నడ, మలయాళంలోనూ టెన్ హవర్స్ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. సన్‍నెక్స్ట్, టెంట్‍కొట్టాలో తమిళంలో స్ట్రీమ్ అవుతోంది. ఇలా మూడు ఓటీటీల్లో ఈ మూవీ ఎంట్రీ ఇచ్చింది.

టెన్ హవర్స్ చిత్రంలో సిబి సత్యరాజ్‍తో పాటు గజరాజ్, దిలీపన్, రాజా అయ్యప్ప, జీవరవి, శవరణ సుబ్బయ్య కీలకపాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కలియాపెరుమాల్ దర్శకత్వం వహించారు. పది గంటల్లో మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఈ సినిమా ఉత్కంఠగానే సాగుతుంది.

టెన్ వహర్స్ చిత్రం స్టోరీలైన్

సేలమ్‍లో ఓ అమ్మాయి మిస్ అవుతుంది. ఈ కేసు పోలీస్ ఇన్‍స్పెక్టర్ కాస్ట్రో (సిబి సత్యరాజ్) వద్దకు వస్తుంది. పోలీసులు ఆ అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే చెన్నై నుంచి కోయంబత్తూరుకు వెళ్లే బస్సులో ఓ మర్డర్ జరుగుతుంది. దీన్ని ఇతర ప్రయాణికులు ముందుగా గమనించరు. ఓ టోల్ చెకింగ్ వద్ద ఇది బయటపడుతుంది. ఆ రాత్రే 10 గంటల్లోనే ఈ మిస్టరీని కాస్ట్రో ఛేదించాల్సి ఉంటుంది. అసలు కిడ్నాప్ అయిన అమ్మాయి ఎవరు? ఆ హత్యకు గురైంది ఎవరు? ఈ మిస్టరిని కాస్ట్రో ఒక్కరాత్రిలో ఛేదించాడా? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే అంశాలు టెన్ హవర్స్ సినిమా స్టోరీలో ఉంటాయి.

టెన్ హవర్స్ సినిమాను డువిన్ స్టూడియోస్ పతాకంపై లతా బాలు, దుర్గాని వినోద్ నిర్మించగా.. కేెస్ సుందరమూర్తి సంగీతం అందించారు. జై కార్తీక్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి లారెన్స్ కిశోర్ ఎడిగింగ్ చేశారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం