Salaar Shruti Haasan Video: సలార్ సెట్స్‌లో ప్రభాస్, ప్రశాంత్, శృతి హాసన్ క్రికెట్ ఆడిన వీడియో చూశారా?
Salaar Shruti Haasan Video: సలార్ సెట్స్ లో సరదా మూమెంట్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గురువారం (డిసెంబర్ 28) శృతి హాసన్ షేర్ చేసింది. ఇందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఆమె క్రికెట్ ఆడుతున్న వీడియో కూడా ఉంది.
Salaar Shruti Haasan Video: సలార్ మూవీ థియేటర్లలో రిలీజై ఆరు రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టిస్తుండగా.. ఈ మూవీ హీరోయిన్ శృతి హాసన్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. సలార్ మూవీ సెట్స్‌లో ఇప్పటి వరకూ ఎవరూ చూడని ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేసింది. ఇందులో ఆమె క్రికెట్ ఆడుతున్న వీడియో కూడా ఉండటం విశేషం.
సలార్ సెట్స్‌లో షూటింగ్ సందర్భంగా తాను గడిపిన సరదా క్షణాలను ఆమె గురువారం (డిసెంబర్ 28) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఇందులో శృతి హాసన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి క్రికెట్ ఆడుతున్న వీడియోతోపాటు ప్రభాస్, ప్రశాంత్ లతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. సలార్ మెమొరీస్ అంటూ శృతి ఈ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.
"సలార్ మెమొరీస్.. ఈ అద్భుతమైన వ్యక్తులతో కలిసి పని చేయడాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. చాలా సరదాగా గడిపాం. ప్రభాస్ మాకు తినిపించాడు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. షాట్స్ మధ్యలో ప్రశాంత్ సర్ మ్యాచ్ లు ఆడుతూ సరదాగా గడిపాడు. ఈ సినిమాలో నటించడం చాలా బాగుంది. మంచి వాళ్లకు జీవితంలో మంచే జరగడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఎంతో హార్డ్ వర్క్ తోపాటు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఈ మెజస్టిక్ ప్రపంచంలో నాకు కూడా భాగంగా కల్పించినందుకు ప్రశాంత్ సర్‌కి, హోంబలే ఫిల్మ్స్ కి థ్యాంక్యూ" అని శృతి రాసింది.
సలార్ సెట్స్ లో టీమ్ అంతా సరదాగా గడిపిన క్షణాలను ఈ పోస్టులో చూడొచ్చు. శృతి హాసన్ బ్యాటింగ్ చేస్తుండగా.. ప్రశాంత్ నీల్ వికెట్ కీపింగ్ చేశాడు. ఇక మరో ఫొటోలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో శృతి దిగిన ఫొటో కూడా ఉంది. సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది.