స్పాయిల్ చేయాలని లేదు, మైండ్ బెండింగ్ ట్విస్టులు: ఓటీటీ హారర్ థ్రిల్లర్‌పై శ్రుతి హాసన్ ప్రశంసలు- ఇక్కడ చూసేయండి!-shruti haasan favourite horror thriller movie the others ott streaming on amazon prime with about 7 rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  స్పాయిల్ చేయాలని లేదు, మైండ్ బెండింగ్ ట్విస్టులు: ఓటీటీ హారర్ థ్రిల్లర్‌పై శ్రుతి హాసన్ ప్రశంసలు- ఇక్కడ చూసేయండి!

స్పాయిల్ చేయాలని లేదు, మైండ్ బెండింగ్ ట్విస్టులు: ఓటీటీ హారర్ థ్రిల్లర్‌పై శ్రుతి హాసన్ ప్రశంసలు- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

హీరోయిన్ శ్రుతి హాసన్ మెచ్చిన ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. యాక్షన్ సినిమాల్లో గ్లామర్ రూల్స్‌తో అట్రాక్ట్ చేసే శ్రుతి హాసన్‌ను మెప్పించిన ఓటీటీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ది అదర్స్. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ ఉంది. ది అదర్స్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

స్పాయిల్ చేయాలని లేదు, మైండ్ బెండింగ్ ట్విస్టులు: ఓటీటీ హారర్ థ్రిల్లర్‌పై శ్రుతి హాసన్ ప్రశంసలు- ఇక్కడ చూసేయండి!

హీరోయిన్‌గా శ్రుతి హాసన్ సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రుతి హాసన్ మొదట్లో సింగర్‌గా తన గాత్రంతో అలరించింది. అనంతరం బాలీవుడ్ మూవీ లక్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. కానీ, ఆ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది.

మొదట బాలీవుడ్‌లో హీరోయిన్‌గా

ఆ తర్వాత తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. చాలా కాలం గ్యాప్ తర్వాత గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసు గుర్రం, శ్రీమంతుడు, సింగం 3, క్రాక్ వంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్‌ రేంజ్‌కు వెళ్లిపోయింది శ్రుతి హాసన్.

ఓటీటీ హారర్ థ్రిల్లర్

సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి అలరించింది శ్రుతి హాసన్. ది ఐ అనే ఇంగ్లీష్‌ మూవీతో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల ప్రభాస్ సలార్‌లో అట్రాక్ట్ చేసిన శ్రుతి హాసన్.. కూలీ మూవీలో కీలక పాత్ర చేసింది. ఇలా ఎన్నో రోల్స్ చేసిన శ్రుతి హాసన్ తనకు నచ్చిన ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీ గురించి చెప్పింది.

అందరు కచ్చితంగా చూడాలి

ఓ ఇంటర్వ్యూలో "మీ ఫేవరేట్ హారర్ మూవీ ఏంటీ" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు తాను మెచ్చిన హారర్ థ్రిల్లర్ గురించి చెప్పింది శ్రుతి హాసన్. "నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి ది అదర్స్. మీరు కచ్చితంగా చూడాలి ఇది. మీరే కాదు అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అందులో నికోల్ కిడ్‌మన్ నటించారు" అని శ్రుతి హాసన్ చెప్పింది.

మైండ్ బెండింగ్ ట్విస్టులు

"నాకు స్టోరీ చెప్పి స్పాయిల్ చేయాలని లేదు. ఒక బెస్ట్ వేలో మైండ్ బెండింగ్ ట్విస్టులున్న సినిమా ఇది. చాలా బాగుంటుంది" అని చాలా ఎగ్జైట్ అవుతూ శ్రుతి హాసన్ తెలిపింది. శ్రుతి హాసన్ సజెస్ట్ చేసిన ఈ ఓటీటీ హారర్ థ్రిల్లర్, హీరోయిన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇద్దరు పిల్లలతో తల్లి

శ్రుతి హాసన్ మెచ్చిన ది అదర్స్ ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇద్దరు పిల్లలతో ఉన్న తల్లి ఇంట్లోకి ముగ్గురు పని చేసేవాళ్లు వస్తారు. ఆ తర్వాత పిల్లలకు కనిపించే హారర్ సీన్స్ ఏంటీ?, ఆ పిల్లలకు ఏమైంది?, నిజానికి వారు పిల్లలా దెయ్యాలా? అనేటువంటి మైండ్ బ్లాక్ ట్విస్టులతో ది అదర్స్ సాగుతుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఇక క్లైమాక్స్ ట్విస్ట్ తర్వాత అప్పటివరకు చూసిన సినిమా స్టోరీ మొత్తం మారిపోతుంది. అలాంటి బెస్ట్ ట్విస్ట్ ప్లాట్ ఉన్న సినిమానే ది అదర్స్. దీనికి ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ ఉంది. ప్రస్తుతంది అమెజాన్ ప్రైమ్‌లో ది అదర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, రెంటల్ విధానంలో మాత్రమే ప్రైమ్ వీడియోలో ది అదర్స్ ఓటీటీ రిలీజ్ అయింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం