టాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ శ్రుతి హాసన్. అయితే, ఇటీవల శ్రుతి హాసన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రుతి హాసన్ తన తల్లిదండ్రులు కమల్ హాసన్-సారిక విడిపోవడంపై రీసెంట్‌గా స్పందించింది.
శ్రుతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక 2004లో విడిపోయి విడాకులు తీసుకున్నారు. అయితే, ఎన్నో సంవత్సరాల క్రితం కమల్ హాసన్, సారిక జంట విడిపోగా చాలా ఏళ్లకు ఇప్పుడు తొలిసారిగా శ్రుతి హాసన్ నోరు విప్పింది. ఫిల్మ్ ఫేర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రుతి హాసన్ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన తనకు ఎలాంటి హక్కు లేదని తెలిపింది. చిన్నతనం నుంచి చాలా వినయంగా ఉండేదాన్నని శ్రుతి హాసన్ పేర్కొంది. శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. "నటుల కుటుంబం నుంచి వచ్చిన నాకు చిన్నప్పటి నుంచి వినయంగా ఉన్నప్పటికీ ఎలాంటి అర్హత (హక్కు) లేదనిపించింది" అని తెలిపింది.
"ఎదుగుతున్న వ్యక్తిగా మీరు ఎప్పుడైనా ప్రత్యేకమైనవారుగా, హక్కున్నవారిగా అనిపించుకున్నారా" అని శ్రుతిని ప్రశ్నించగా.. "లేదు, ఎందుకంటే నేను సినీ పరిశ్రమలోకి రాకముందు నాకు ఏమైందో చాలా మందికి తెలియదు. అమ్మానాన్నలు విడిపోవడంతో జీవితం దుర్భరంగా మారింది" అని శ్రుతి హాసన్ తెలిపింది.
"మేము పెద్ద భవనంలో నివసించడం లేదు. మా అమ్మ వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు మేము చెన్నై నుంచి ముంబైకి మారాము. అక్కడ అంత సౌకర్యంగా లేదు. అప్పుడు జీవితం నేర్పిన పాఠాలకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీరు మెర్సిడెస్ నుంచి లోకల్ ట్రైన్‌కు కూడా వెళ్లొచ్చని నేను నేర్చుకున్నాను. ఎలా అంటే జీవితం ఎంత వేగంగా మారుతుందో అలా. ఈ రెండూ మీరు నేర్చుకోవాల్సిన ప్రయాణాలు" అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
"నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు అప్పటికి నేను అప్పా (కమల్ హాసన్)తో కనెక్ట్ అయ్యాను. నేను విదేశాలలో సంగీతం నేర్చుకోవడానికి వెళ్లాను. కానీ, నాకంటూ ఓ స్పేస్ ఉండాలి. నా డబ్బు నేను సంపాదించుకోవాలి, స్వతహాగా ఉండాలి, అనే భావన నాకు ఎల్లప్పుడు ఉండేది" అని శ్రుతి హాసన్ పేర్కొంది.
"నేను కొంచెం యాటిట్యూడ్‌తో ఉండేదాన్ని. కానీ, వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ ప్లేసులో అంతకన్నా బెటర్‌గా ఉండలేం అనిపించింది. ఇది పూర్తిగా భయం, నేను తక్కువ అని భావించడం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడం నుంచి వచ్చింది" అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే, శ్రుతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక 1988లో పెళ్లి చేసుకుని 2004లో విడిపోయారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక శ్రుతి హాసన్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ చిత్రంలో నటిస్తోంది.
కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, సందీప్ కిషన్, రెబా మోనికా జాన్ తదితరులు నటిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్