Shruti Haasan: హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది శృతి హాసన్. సైకలాజిక్ థ్రిల్లర్ కథాంశంతో ది ఐ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీకి డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించాడు. వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది ఐ మూవీ స్క్రీనింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హారర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను ప్రదర్శించబోతున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభ మూవీగా ది ఐ ప్రీమియర్ కానుంది.
డయానా (శృతి హాసన్) తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం సాగించే ప్రయాణం నేపథ్యంలో ది ఐ మూవీ తెరకెక్కుతోంది. చనిపోయిన తన భర్తను మళ్లీ తిరిగి తీసుకు వచ్చేందుకు డయానా ఏం చేసింది? తన భర్తను వెనక్కి తిరిగి తెచ్చుకునేందుకు డయానా చేసిన త్యాగాలు ఏంటి? అనే కథాంశంతో ది ఐ మూవీ తెరకెక్కుతోంది.
గ్రీస్, ఏథెన్స్, కోర్ఫులోని పలు అందమైన లొకేషన్స్‌లో ది ఐ మూవీని షూట్ చేశారు. ఈ విజువల్స్ ఆకట్టుకుంటాయి. 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది ఐ మూవీ స్క్రీనింగ్ అయ్యింది.
ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ.. ‘సైకలాజికల్ థ్రిల్లర్ నా ఫేవరేట్ జానర్. మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిలను చేయడానికి, చూడటానికి ఇష్టపడుతుంటాడు. ది ఐ నా కెరీర్‌లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ టీమ్ మొత్తం మహిళలే కావడం గమనార్హం అని చెప్పింది.
‘ది ఐ మూవీలో శృతి హాసన్ ఛాలెంజింగ్ రోల్ చేసింది. డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే డయానా పాత్రలో శృతి హాసన్ చక్కగా నటించింది అని దర్శకుడు డాఫ్నే ష్మోన్ పేర్కొన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా కొత్త విధానంలో ది మూవీని మూవీని షూట్ చేశారు.
ప్రస్తుతం రజనీకాంత్ కూలీ మూవీలో శృతిహాసన్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ జననాయగన్‌లో శృతి హాసన్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగులో అడివిశేష్‌తో డెకాయిట్ సినిమాను శృతి హాసన్ చేయాల్సింది. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత ఈ మూవీ నుంచి శృతిహాసన్ తప్పుకున్నది. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను మేకర్స్ హీరోయిన్‌గా తీసుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్