Shraddha Srinath: విశ్వక్ సేన్‌తో ఫలక్‌నూమా దాస్ చేయకపోవడంపై నోరు విప్పిన శ్రద్ధా శ్రీనాథ్- అప్పుడో కారణం, ఇప్పుడు ఇలా!
Shraddha Srinath About Reject Vishwak Sen Movie: విశ్వక్ సేన్‌తో ఫలక్‌నూమా దాస్ మూవీని రెజెక్ట్ చేయడంపై నోరు విప్పింది హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ఇటీవల మెకానిక్ రాకీ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆ మూవీ అంతగా ఎగ్జైటెడ్‌గా అనిపించలేదని చెప్పిన శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా కొత్త కారణం తెలిపింది.
Shraddha Srinath On Vishwak Sen Movie: నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల మూవీలో ఒక హీరోయిన్‌గా యాక్ట్ చేసి పాపులర్ అయింది శ్రద్ధా శ్రీనాథ్.
బాలకృష్ణ సినిమాలో
ఆ తర్వాత తెలుగులో కొంత కాలం గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల వెంకటేష్ సైంధవ్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ సినిమా అంతగా హిట్ కానప్పటికీ శ్రద్ధా శ్రీనాథ్‌కు మాత్రం ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలో విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ మూవీతో అలరించేందుకు సిద్ధంగా ఉన్న శ్రద్ధా శ్రీనాథ్ నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.
బెంగళూరు వెళ్లి మరి
అయితే, విశ్వక్ సేన్‌తో ఇదివరకు ఫలక్‌నూమా దాస్ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ నటించాల్సి ఉంది. హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ను ఓకే చేసేందుకు బెంగళూరు వెళ్లాడు విశ్వక్ సేన్. కానీ, ఫలక్‌నూమా దాస్ కథ విన్న శ్రద్ధా శ్రీనాథ్ ఆ ఆఫర్‌ను రెజెక్ట్ చేసింది. దీని గురించి మెకానిక్ రాకీ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆ మూవీ అంతగా ఎగ్జయిటెడ్‌గా అనిపించలేదని, సాధారణంగా చాలా వరకు సినిమాలను తిరస్కరిస్తాం కదా అని చెప్పింది శ్రద్ధా.
మరో కారణం
అలాగే, ఫలక్‌నూమా దాస్ రెజెక్ట్ చేసినప్పటికీ విశ్వక్ సేన్‌తో నటించాలని ఉండేదని, అది ఇప్పుడు జరిగిందని, భవిష్యత్‌లో కూడా నటించాలని ఉందని శ్రద్ధా శ్రీనాథ్ తెలిపింది. అయితే, తాజాగా ఫలక్‌నూమా దాస్‌ను రెజెక్ట్ చేయడంపై మరో కారణం చెప్పిన శ్రద్ధా శ్రీనాథ్ రివ్యూస్, ఫిలిం క్రిటిసిజంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
రివ్యూస్, క్రిటిసిజంను ఎలా తీసుకుంటారు ?
-ఫిలిం క్రిటిసిజంను అంత సీరియస్‌గా తీసుకోను. సినిమా గురించి ఎవరైనా ఒపినియన్ చెప్పొచ్చు. ఒక ఆడియన్‌గా నాకూ ఒక ఒపినియన్ ఉంటుంది. అయితే పర్సనల్ ఎటాక్ మాత్రం కాస్త హర్టింగ్‌గా అనిపిస్తుంది.
గతంలో మీరు విశ్వక్ చెప్పిన ఓ కథని రిజెక్ట్ చేశారని విన్నాం?
-అది (ఫలక్‌నూమా దాస్) ఓ రీమేక్. నిజానికి నాకు రిమేక్ సినిమాలు చేయడం అంతగా ఇష్టం ఉండదు. రీమేక్ సినిమాల్లో నటించాలంటే కొంచెం భయం ఉండేది. అందుకే ఆ సినిమా చేయడం కుదరలేదు. అలా ఫలక్‌నూమా దాస్ దాస్ తర్వాత మరో రెండు సినిమాల ఆఫర్స్ కోల్పోయా. ఫైనల్‌గా మెకానిక్ రాకీలో విశ్వక్‌తో కలసి పని చేయడం చాలా ఎగ్జయిటెడ్‌గా అనిపించింది.
-విశ్వక్ ఆన్‌స్క్రీన్ ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టం. అఫ్ స్క్రీన్ తను చాలా సరదాగా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను.
మీకు ఇష్టమైన జోనర్ ఏమిటి?
- చూడటాని హారర్ జోనర్ ఇష్టం. 'కల్కి' లాంటి సైన్స్ ఫిక్షన్ కథల్లో నటించడానికి ఇష్టపడతాను. అలాగే బాహుబలి లాంటి పిరియడ్ సినిమాలో పార్ట్ అవ్వాలని ఉంటుంది. అలాగే కామెడీ సినిమాల్లో కూడా చేయాలని ఉంది. మెకానిక్ రాకీ తర్వాత నాకు ఇంకా డిఫరెంట్ రోల్స్ వస్తాయని భావిస్తున్నాను.
మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్?
-డాకు మహారాజ్ సంక్రాంతి కి వస్తోంది. తమిళ్‌లో ఓ వెబ్ సిరిస్ చేస్తున్నాను. విష్ణు విశాల్‌తో ఓ సినిమా చేస్తున్నాను.