Shraddha Srinath: రెండేళ్లకోసారి రాష్ట్రాలు మారుతుంటాం.. ఫ్యామిలీపై జెర్సీ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్స్
Shraddha Srinath About Mechanic Rocky Movie: విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ మూవీలో ఒక హీరోయిన్‌గా చేసింది శ్రద్ధా శ్రీనాథ్. గతంలో నాని జెర్సీ మూవీతో ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ నటించిన మెకానిక్ రాకీ నవంబర్ 22న థియేట్రికల్ రిలీజ్ కానున్న సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Shraddha Srinath Comments: నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెకానిక్ రాకీలో ఒక హీరోయిన్‌గా కనిపించనుంది శ్రద్ధా శ్రీనాథ్.
రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న మెకానిక్ రాకీ సినిమాలో శ్రద్ధాతో పాటు మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా చేసింది. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన మెకానిక్ రాకీ నవంబర్ 22న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రద్ధా శ్రీనాథ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.
ఈ కథలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?
-నేను ఒక ఆర్మీ ఫ్యామిలీలో పుట్టాను. ప్రతి రెండేళ్లకోసారి స్టేట్ షిఫ్ట్ (రాష్ట్రాలు మారడం) అవుతుంటాము. సహజంగానే నాకు డిఫరెంట్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడం ఇష్టం. 'మెకానిక్ రాకీ'లో నాది డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటివరకూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇది నాకు చాలా ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. ఒక ఛాలెంజ్ తీసుకొని చేశాను. మాయ క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. అలాగే విశ్వక్‌తో కలసి నటించడం చాలా ఎగ్జయిటెడ్‌గా అనిపించింది.
మీ పాత్ర ఎలా ఉంటుంది?
-కథలో నా క్యారెక్టర్ కాంట్రీబ్యూషన్ చాలా క్రూషియల్‌గా ఉంటుంది. మెకానిక్ రాకీ జీవితంలో మాయ ఎలాంటి రోల్ ప్లే చేసిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియన్స్‌కి చాలా సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు ఉంటాయి. చాలా విజిల్ మూమెంట్స్ ఉంటాయి. డైరెక్టర్ రవితేజ చాలా అద్భుతంగా తీశారు.
మీనాక్షితో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా?
-మాకు కాంబినేషన్ సీన్స్ పెద్దగా లేవు కానీ సెట్స్‌లో చాలా సార్లు కలిశాం. తనది కూడా ఆర్మీ కుటుంబమే. మాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి.
ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో వర్క్ చేయడం గురించి?
-చాలా గ్రాండ్‌గా మెకానిక్ రాకీ సినిమాని తీశారు. టెక్నికల్‌గా సినిమా టాప్ నాచ్ ఉంటుంది. జేక్స్ బిజోయ్ అద్భుతమై మ్యూజిక్ ఇచ్చారు.
మీ తొమ్మిదేళ్ల సినీ జర్నీ ఎలా అనిపిస్తోంది?
-నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేరు. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకొని ముందుకు వెళుతున్నాను. ఈ జర్నీలో హైస్ అండ్ లోస్ ఉన్నాయి. జెర్సీ తర్వాత పీక్స్ చూశాను. కోవిడ్‌లో సినిమాలు ఆగినప్పుడు అందరిలానే నేనూ భయపడ్డాను. నా సినీ జర్నీ జీవితంలానే అలా ముందుకు సాగుతోంది. హిట్స్, ఫ్లాప్స్‌ని ఒకేలా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. నాకు క్యాలిటీ వర్క్స్ చేయడం ఇష్టం. అందుకే కొంచెం సెలెక్టివ్‌గా ఉంటాను.
మీ కథ ఎంపిక ఎలా ఉంటుంది?
-కథ వచ్చినపుడు అది హిట్టా అవుతుందా లేదా అనేది మన చేతిలో ఉండదు. పేపర్ మీద అది ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూసుకుంటాను. అలాగే నా క్యారెక్టర్‌కి ఉన్న ప్రాధాన్యత చూస్తాను. ఒక ఆడియన్‌గా ఎలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతానో అలాంటి కథలు చేయడానికి ఇష్టపడతాను.
టాపిక్