Shraddha Srinath: జెర్సీ, డాకు మహారాజ్ సినిమాల్లో ఏది బెస్ట్.. బాలకృష్ణ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆన్సర్ ఏంటంటే?-shraddha srinath comments on balakrishna daaku maharaaj nani jersey which is best movie according to her role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shraddha Srinath: జెర్సీ, డాకు మహారాజ్ సినిమాల్లో ఏది బెస్ట్.. బాలకృష్ణ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆన్సర్ ఏంటంటే?

Shraddha Srinath: జెర్సీ, డాకు మహారాజ్ సినిమాల్లో ఏది బెస్ట్.. బాలకృష్ణ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆన్సర్ ఏంటంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 09, 2025 08:39 AM IST

Shraddha Srinath About Daaku Maharaaj Jersey Difference: బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీలో ఒక హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ చేసింది. ఇదివరకు ఆమె నటించిన నాని జెర్సీ మూవీ ఎంతో పేరు తెచ్చుకుంది. పాత్ర పరంగా జెర్సీ, డాకు మహారాజ్ సినిమాల్లో ఏది బెస్ట్ అన్న ప్రశ్నకు శ్రద్ధా శ్రీనాథ్ ఇచ్చిన ఆన్సర్ ఇదే.!

జెర్సీ, డాకు మహారాజ్ సినిమాల్లో ఏది బెస్ట్.. బాలకృష్ణ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆన్సర్ ఏంటంటే?
జెర్సీ, డాకు మహారాజ్ సినిమాల్లో ఏది బెస్ట్.. బాలకృష్ణ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆన్సర్ ఏంటంటే?

Shraddha Srinath About Daaku Maharaaj Jersey Difference: నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

yearly horoscope entry point

బ్లాక్ బస్టర్ దర్శకుడు డాకు మహారాజ్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ డాకు మహారాజ్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బాలకృష్ణ గారి గురించి?

ఎన్నో ఏళ్ల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నారు. నేనొక బిగ్ స్టార్‌ని అనే అహం బాలకృష్ణ గారిలో కొంచెం కూడా ఉండదు. సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటారు. తనకంటే చిన్నా పెద్దా అని చూడకుండా దర్శకుడికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

'డాకు మహారాజ్' సినిమాలో నటించడం ఎలా ఉంది?

నేను ఇప్పటివరకు కొన్ని విభిన్న సినిమాలు చేశాను. అయితే ఈ చిత్రం మాత్రం ఒక పూర్తి ప్యాకేజ్‌లా ఉంటుంది. ఇలాంటి సినిమా నేను ఇప్పటి వరకు చేయలేదు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. పైగా బాలకృష్ణ గారి సినిమా అంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నా ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది.

మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

నా పాత్ర పేరు నందిని. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఎంతో ఓపిక ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుసు. నా పాత్రలో ఎంతో డెప్త్ ఉంటుంది. నటనకు కూడా ఎంతో ఆస్కారముంది.

'డాకు మహారాజ్' మీ సినీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది?

ఈ సినిమాపైనా, ఇందులో నేను పోషించిన నందిని పాత్ర పైనా ఎంతో నమ్మకంగా ఉన్నాను. నందిని పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నాను.

ఈ సినిమా ప్రయాణంలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించింది ఏంటి?

నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్‌లు కరెక్ట్ మెజర్‌లో ఉంటాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు.

మీ పాత్ర పరంగా 'జెర్సీ', 'డాకు మహారాజ్' సినిమాల్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు?

రెండూ వేటికవే ప్రత్యేకం. జెర్సీలో నేను పోషించిన సారా పాత్ర నా మనసుకి బాగా నచ్చిన పాత్ర. ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరించారు. ఇప్పుడు డాకు మహారాజ్‌లోని నందిని పాత్ర కూడా ప్రేక్షకులకు ఆ స్థాయిలో చేరువ అవుతుందనే నమ్మకం ఉంది.

Whats_app_banner