షాకింగ్.. డ్రింక్ లో మత్తుమందు..హీరోయిన్ పై లైంగిక వేధింపులు.. వీడియోతో బెదిరింపు.. నిర్మాత కమ్ డైరెక్టర్, నటుడు అరెస్ట్-shocking alleged sexual harassment on heroine bengaluru filmmaker actor hemanth kumar arrested ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  షాకింగ్.. డ్రింక్ లో మత్తుమందు..హీరోయిన్ పై లైంగిక వేధింపులు.. వీడియోతో బెదిరింపు.. నిర్మాత కమ్ డైరెక్టర్, నటుడు అరెస్ట్

షాకింగ్.. డ్రింక్ లో మత్తుమందు..హీరోయిన్ పై లైంగిక వేధింపులు.. వీడియోతో బెదిరింపు.. నిర్మాత కమ్ డైరెక్టర్, నటుడు అరెస్ట్

షాకింగ్.. ఓ హీరోయిన్ పై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. రియాలిటీ షో విజేత, టెలివిజన్ నటి ఫిర్యాదు మేరకు నిర్మాత కమ్ డైరెక్టర్ తో పాటు నటుడు కూడా అయిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హీరోయిన్ పై లైంగిక వేధింపులు

షాకింగ్.. బెంగళూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సినిమాలో అవకాశం ఇస్తానని ఓ హీరోయిన్ ను లైంగిక వేధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. నటుడు, దర్శకుడు, నిర్మాత బి.ఐ. హేమంత్ కుమార్‌ను లైంగిక వేధింపులు, మోసం, నేరపూరిత బెదిరింపుల ఆరోపణలపై రాజరాజేశ్వరి నగర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం ఓ టెలివిజన్ నటి, రియాలిటీ షో విజేత కూడా అయిన హీరోయిన్ ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగింది. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది.

ఫిర్యాదులో ఏముంది?

2022లో హేమంత్ నటిని సంప్రదించి సినిమాలో అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. సినిమా టైటిల్ గురించి వేర్వేరు కథనాలు వినిపిస్తున్నాయి. ఎన్డీటీవీ దానిని 3 అని, ఇండియా టుడే దానిని రిచి అని పేర్కొన్నాయి. రూ.2 లక్షల పారితోషికానికి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. నటి రూ.60,000 అడ్వాన్స్‌గా అందుకుంది. అయితే హేమంత్ షూటింగ్‌ను ఆలస్యం చేశాడని, అసభ్యకరమైన దుస్తులు ధరించాలని, అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వేధించడం ప్రారంభించాడని ఆరోపణలు ఉన్నాయి.

రౌడీలతో బెదిరింపు

ముంబైకి ప్రమోషనల్ ట్రిప్‌లో హేమంత్ తనను అనుచితంగా తాకి వేధించాడని కూడా నటి పోలీసు నివేదికలో పేర్కొంది. సెట్‌లో మాత్రమే కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా ఈ ప్రవర్తన ఆగలేదని నటి ఫిర్యాదు చేసింది. ఆమె ప్రతిఘటించినప్పుడు హేమంత్ రౌడీలను పంపి బెదిరించాడని నటి తన ఫిర్యాదులో పేర్కొంది. అటువంటి బెదిరింపులు ఫిర్యాదుదారు భద్రత, శ్రేయస్సు గురించి భయాన్ని కలిగించాయని పోలీసులు పేర్కొన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

సోషల్ మీడియాలో

ఫిల్మ్ ఛాంబర్ ను ఆ నటి ఆశ్రయించిన ఫలితం దక్కలేదు. దీంతో కోర్టును ఆశ్రయించిన నటి వేధింపులతో పాటు, ఆర్థిక అవకతవకలు, తన చిత్రాలను అనధికారికంగా ఉపయోగించారని ఆరోపించింది. హేమంత్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందని, నటి అనుమతి లేకుండా సినిమాలోని అసభ్యకరమైన సన్నివేశాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. నటి ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించి మధ్యవర్తిత్వం చేసుకుందని సమాచారం. అయితే హేమంత్ ఆమెను వేధించడని, బెదిరించడం కొనసాగించాడని ఆరోపణలు ఉన్నాయి.

మత్తు మందు కలిపి

2023 వరకు వేధింపులు కొనసాగాయని, హేమంత్ నటి తాగిన డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి, మత్తులో ఉన్న స్థితిలో చిత్రీకరించి, ఆ తర్వాత వీడియోను ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అతను గూండాలను పంపి ఆమెను, ఆమె తల్లిని బెదిరించాడని కూడా ఆరోపించారు. నటి బెంగళూరు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, హేమంత్ వీడియోలను అప్‌లోడ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతను ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేయడం కొనసాగించాడని ఆరోపణలు ఉన్నాయి. హేమంత్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం