Shivani Rajashekar | మిస్ ఇండియా టైటిల్ కు చేరువలో శివాని రాజశేఖర్-shivani rajasekhar crowned as miss tamilnadu 2022 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shivani Rajashekar | మిస్ ఇండియా టైటిల్ కు చేరువలో శివాని రాజశేఖర్

Shivani Rajashekar | మిస్ ఇండియా టైటిల్ కు చేరువలో శివాని రాజశేఖర్

HT Telugu Desk HT Telugu

హీరో రాజశేఖర్ తనయ శివాని రాజశేఖర్ మిస్ ఇండియా టైటిల్ కు చేరువలో నిలిచింది. మిస్ తమిళనాడుగా ఎంపికైన ఆమె మిస్ ఇండియా ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించింది.

శివాని రాజశేఖర్ (instagram)

htటాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాని రాజ‌శేఖ‌ర్ మిస్ ఇండియా పోటీల్లో దూసుకుపోతున్నది. ఈ అందాల పోటీల్లో విన్నర్ గా నిలవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో పుట్టిన శివాని రాజశేఖర్ తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. దాంతో మూడు రాష్ట్రాల నుంచి మిస్ ఇండియా పోటీల్లో ఆమెకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దొరికింది.

 శనివారం ఆమె ఫెమినా మిస్ తమిళనాడుగా ఎంపికైంది. మిస్ ఇండియా పోటీల్లో తుది రౌండ్ కు అర్హత సాధించింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మొత్తం మూడు వందల మంది పాల్గొన్నారు. తుది రౌండ్ కు ఒక్కో స్టేట్ ఒక్కొక్కరు చొప్పున మొత్తం 31 మంది అర్హత సాధించారు. వీరిలో శివాని మిస్ తమిళనాడుగా ఎంపిక కావడంతో రాజశేఖర్ ఫ్యామిలీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే మిస్ యూనివర్స్ పోటీలకు శివాని నేరుగా అర్హత సాధిస్తుంది. నేడు మిస్ ఇండియా ఫైనల్ రౌండ్ పోటీలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది శివాని. అద్భుతం సినిమాతో గత ఏడాది కథానాయికగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం తండ్రి రాజశేఖర్ తో కలిసి శేఖర్ అనే సినిమా చేస్తోంది శివాని. మే 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. 


సంబంధిత కథనం