#90s Web Series OTT Response: హీరో, బిగ్ బాస్ 7 తెలుగు ఫేమ్ శివాజీ, నటి వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా వెబ్ సిరీస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈ హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్‌కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా.. ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. నవీన్ మేడారం సమర్పించారు.
ఈ హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్‌కు మొదటి నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో బజ్ బాగానే క్రియేట్ చేసుకుంది. ఇక హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు విపరీతమైన స్పందన లభించింది. మధ్య తరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్ సిరీస్‌కు ఇప్పుడు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. జనవరి 5న ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్ తాజాగా 120 మిలియన్ వ్యూస్ అంటే సుమారు 12 కోట్ల వీక్షణలు సొంతం చేసుకుని సూపర్బ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్‌కు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB)లో 9.6 స్టార్ రేటింగ్ దక్కించుకున్నట్లు అదే పోస్టర్ ద్వారా తెలిపింది.
ఇటీవల తెలుగులో వచ్చిన మంచి సిరీసుల్లో ఒకటిగా ఈ హ్యాష్ ట్యాగ్ 90స్ స్థానం సంపాదించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది హాట్ స్టార్‌లో వచ్చిన సేవ్ ది టైగర్స్ ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు ఈటీవీ విన్‌లోని హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్ అంతే ఘన విజయం సాధించినట్లు తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్‌లో శివాజీ, వాసుకి ఆనంద్ సాయితోపాటు మౌళీ, వసంతిక, రోహన్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
హ్యాష్ ట్యాగ్ 90స్ వెబ్ సిరీసులో శివాజీ, వాసుకి తల్లిదండ్రులుగా నటిస్తే వారికి పిల్లలుగా మౌళీ, రోహన్ రాయ్ నటించారు. ఈ సిరీసు ద్వారా 90స్ లో అప్పటి జనరేషన్ పిల్లలు, తల్లిదండ్రులు, అప్పటి పరిస్థితులను డైరెక్టర్ చక్కగా చూపించారని టాక్ వస్తోంది. ప్రతి ఒక్క 90స్ కిడ్‌కు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతోందని తెలుస్తోంది. దాంతో ఈటీవీ విన్ ఓటీటీకి సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగిందని ప్రచారం జరుగుతోంది.
కాగా #90స్ సిరీసులో 90వ దశకం నాటి పరిస్థితులను ప్రతింబించేలా సినిమాటోగ్రఫీ, సెట్స్‌ను తీర్చిదిద్దిన విధానం, సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం చాలా అద్భుతంగా ఉన్నాయని టాక్. ఇదివరకు విడుదల చేసిన ట్రైలర్‌లో శివాజీ గురించి అతడి కొడుకు తన క్లాస్‌మేట్ అయిన అమ్మాయికి వివరించే సీన్‌తో ఆరంభమై ఆద్యంతం నవ్వులు పంచింది. శివాజీ లెక్కల మాస్టర్ చంద్రశేఖర్‌గా అలరించారు.
శివాజీ కుటుంబం, ఇల్లు, స్కూల్‌లో పిల్లల అల్లరి .. ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ట్రైలర్‌లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి శివాజీని పలకరిస్తూ, ‘నేను సుచిత డేవిడ్ పాల్’ అని చెబితే.. కాస్త ఆలోచించిన శివాజీ ‘నాకు కేఏ పాల్ తెలుసు’ అని చెప్పడం బాగా ఆకట్టుకోవడంతో హైలెట్ అయింది.