కన్నడ మూవీ వీర చంద్రహాస సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ అతిథి పాత్రలో నటించిన ఈ మూవీలో శిథిల్ శెట్టి, నాగశ్రీ, ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. వీరచంద్రహాస మూవీకి కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వం వహించారు.
యక్షగానం గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు డైరెక్టర్ రవి బస్రూర్ ఈ మూవీని రూపొందించాడు. కన్నడ ఇతిహాసం జైమిని భారతంలోని మహావీరుడైన చంద్రహాసుడి కథను యక్షగానం కళారూపం ద్వారా ఈ సినిమాలో చూపించారు. డిఫరెంట్ అటెంప్ట్‌గా కన్నడ ప్రేక్షకులను మెప్పించింది ఈ మూవీ. విజువల్స్, టేకింగ్, మ్యూజిక్‌తో పాటు యాక్టింగ్ విషయంలో ప్రశంసలు దక్కాయి. ఐఎమ్‌డీబీలో పదికిగాను 8.3 రేటింగ్‌ను ఈ మూవీ సొంతం చేసుకున్నది.
చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమవుతాడు చంద్రహాసుడు. మంత్రి దుష్టబుద్ది కుతంత్రాల కారణంగా అడుగడుగునా చంద్రహాసుడికి అవరోధాలు ఎదురవుతుంటాయి. దుష్టబుద్ది కుట్రలను ఎదురించి కుంతల సామ్రాజ్య అధినేతగా చంద్రహాసుడు ఎలా నిలిచాడు? చంద్రహాసుడిపై దుష్టబుద్ధి పగకు కారణం ఏమిటి? అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
శివరాజ్‌కుమార్ అతిథి పాత్ర వీరచంద్రహాస మూవీకి హైలైట్‌గా నిలిచింది. స్క్రీన్ టైమ్ తక్కువే అయినా తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. వీరచంద్రహాస మూవీ తెలుగు వెర్షన్ త్వరలో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
వీరచంద్రహాస మూవీకి దర్శకత్వం వహిస్తూనే ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించాడు రవి బస్రూర్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్ గా రవి బస్రూర్ పేరు దక్షిణాది చిత్రసీమలో మారుమ్రోగిపోయింది. ఈ సినిమా లతో కన్నడంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. ప్రభాస్ సలార్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రవి బస్రూర్. సలార్ తర్వాత భీమా, జీబ్రా, షణ్ముఖతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలకు రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.
సంబంధిత కథనం