Shiva Kandukuri: దిష్టి బొమ్మ అసలు కథ ఎవరికీ తెలియదు.. హీరో శివకందుకూరి కామెంట్స్
Shiva Kandukuri About Bhoothaddam Bhaskar Narayana: హీరో శివ కందుకూరి తాజాగా నటించిన సినిమా భూతద్ధం భాస్కర్ నారాయణ. క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో కథ అంతా దిష్టి బొమ్మ చుట్టూ తిరుగుతుంది. దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు శివ కందుకూరి.
Shiva Kandukuri About Dishti Bomma: శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ భూతద్ధం భాస్కర్ నారాయణ. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల అయింది. భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శివ కందుకూరి ఇంటర్వ్యూ ఇచ్చారు. భూతద్ధం భాస్కర్ నారాయణ విశేషాలని పంచుకున్నారు.
మీకు ఇది తొలి డిటెక్టివ్ సినిమా కదా. ఈ అనుభవం ఎలా ఉంది?
క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ తెలుగులో చాలా వచ్చాయి. డిటెక్టివ్ అనేసరికి చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి జోనర్ సినిమా చేయాలనుకున్నపుడు ఏదో యునిక్ నెస్ ఉంటే తప్పితే చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సమయంలో భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విన్నాను. ఇందులో ఒక మైథాలజీ ఎలిమెంట్ ఉంది. మునుపెన్నడూ ఇలాంటి ఎలిమెంట్ ఏ డిటెక్టివ్ సినిమాలో లేదు. అది నాకు కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది.
"దిష్టి బొమ్మ మనం చూస్తుంటాం. కానీ, అసలు అది ఎందుకు ఉందనేది పెద్దగా పట్టించుకోము. దాని గురించి చాలా మందికి తెలీదు. దిని గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. దానిని ఈ కథకు చాలా అద్భుతంగా జోడించాడు దర్శకుడు. దీంతో చాలా కొత్తదనం ఉంటుంది. అలాగే ఇందులో డిటెక్టివ్ పాత్ర కూడా చాలా అభిన్నంగా డిజైన్ చేశారు. కథ విన్నప్పుడు ఎంత ఎగ్జయిటింగ్‌గా అనిపించిందో సినిమా చూసినప్పుడు అది మరింతగా పెరిగింది. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది అని" శివ కందుకూరి తెలిపాడు.
డిటెక్టివ్ అంటే బ్లాక్ నడ బ్లాక్ చూపిస్తుంటారు. ఇందులో మాత్రం పంచెకట్టు, లుంగీలో కనిపించారు?
దర్శకుడు పురుషోత్తం రాజ్ గారిది అనంతపురం దగ్గర ఓ విలేజ్. ఇందులో ఉన్న పాత్రలని ఆయన పల్లె జీవనంలో చూసిన పాత్రల్లా డిజైన్ చేశారు. ఈ కథ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్య ఉండే ఫారెస్ట్ టౌన్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో డిటెక్టివ్ పాత్రని కూడా అక్కడ ఉన్న ఓ సహజసిద్దమైన పాత్రలానే డిజైన్ చేశారు. దీంతో వరల్డ్ బిల్డింగ్‌లో ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది.
భూతద్ధం భాస్కర్ నారాయణ టైటిల్ పెట్టడానికి కారణం ?
ఇందులో నా పేరు భాస్కర్ నారాయణ. ఆ పాత్రకు భూతద్ధం సైజు కళ్లద్దాలు ఉంటాయి. దీంతో అందరూ భూతద్ధం భాస్కర్ నారాయణ అని పిలుస్తుంటారు. డిటెక్టివ్ అనేసరికి భూతద్ధంని వాడుతుంటాం. టైటిల్ కి పాత్రకు రెండికి ఆ టైటిల్ యాప్ట్‌గా సరిపోయింది. ఇందులో ఫన్ ఎలిమెంట్ కూడా ఉంది. అయితే కథలో భాగమైయ్యే ఉంటుంది. అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా కథలో లీనమయ్యే ఉంటుంది.
ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం జరగడానికి కారణం ?
వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండే సినిమా ఇది. మేము మొదట ఎంచుకున్న వీఎఫ్ఎక్స్ టీం ఇచ్చిన అవుట్ పుట్ మాకు తృప్తిని ఇవ్వలేదు. దీంతో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మరో కంపెనీతో మొదటి నుంచి చేయించారు. ఈ విషయంలో నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతున్నాను. సీజీ వర్క్ అద్భుతంగా వచ్చింది. ఈ కథ, సినిమాపై ఉన్న నమ్మకం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మైథాలజీకల్ థ్రిల్లర్ జోనర్స్‌ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా రావడం మంచి పరిణామం అనిపిస్తోంది. బిజినెస్ పరంగా కూడా నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక నటుడిగా ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని విడుదల చేస్తుండటం మాకు మరింత బలాన్ని ఇచ్చింది.