Bhoothaddam Bhaskar Narayana: మనసులో ఆ కోరిక ఉండేది: క్రైమ్ థ్రిల్లర్ మూవీ హీరో శివ కందుకూరి-shiva kandukuri comments in bhoothaddam bhaskar narayana success meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhoothaddam Bhaskar Narayana: మనసులో ఆ కోరిక ఉండేది: క్రైమ్ థ్రిల్లర్ మూవీ హీరో శివ కందుకూరి

Bhoothaddam Bhaskar Narayana: మనసులో ఆ కోరిక ఉండేది: క్రైమ్ థ్రిల్లర్ మూవీ హీరో శివ కందుకూరి

Sanjiv Kumar HT Telugu
Mar 03, 2024 11:37 AM IST

Shiva Kandukuri Bhoothaddam Bhaskar Narayana: తాజాగా తెలుగులో క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా వచ్చింది భూతద్ధం భాస్కర్ నారాయణ. మార్చి 1న విడుదలైన సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు.

మనసులో ఆ కోరిక ఉండేది: క్రైమ్ థ్రిల్లర్ మూవీ హీరో శివ కందుకూరి
మనసులో ఆ కోరిక ఉండేది: క్రైమ్ థ్రిల్లర్ మూవీ హీరో శివ కందుకూరి

Shiva Kandukuri: యంగ్ హీరో శివ కందుకూరి నటించిన లేటెస్ట్ టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భూతద్ధం భాస్కర్ నారాయణ. ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించగా స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించారు. దిష్టిబొమ్మ నేపథ్యంలో డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది. థ్రిల్లింగ్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది.

yearly horoscope entry point

"సినిమా మొదలు పెట్టినప్పుడు సినిమా బాగా వస్తే చాలు అనుకున్నాం. తర్వాత ప్రమోషనల్ మెటిరియల్ ప్రేక్షకులకు రీచ్ అయితే చాలు అనుకున్నాం. అన్నిటికి మించి ఒక మంచి హిట్ కొడితే బావున్ను అనే కోరిక మనసు లోపల ఉండేది. మా టీం అందరి కోరిక బలంగా ఉంది. మేము అనుకున్న హిట్ ఈ సినిమాతో అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంత మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ చాలా థాంక్స్" అని సక్సెస్ మీట్‌లో శివ కందుకూరి తెలిపాడు.

"భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాకి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కంటెంట్‌ని ప్రశంసిస్తూ ఇంత మంచి రివ్యూస్ ఇచ్చిన మీడియా అందరికీ ధన్యవాదాలు. సినిమా చూసిన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ఇవ్వాల్సిన విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్‌కి థాంక్స్. తొలి సినిమాతో విజయాన్ని అందుకున్న పురుషోత్తం రాజ్‌కి అభినందనలు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన తనకి చాలా థాంక్స్" అని శివ అన్నాడు.

"ఈ సినిమాతో చాలా మంచి జర్నీ ఉంది. శ్రీచరణ్ అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. సినిమా చుసిన ప్రతి ఒక్కరూ మ్యూజిక్ బావుందని చెబుతున్నారు. విజయ్ రెండు బ్యుటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. షఫీ, అరుణ్, దేవి ప్రసాద్ అందరూ అద్భుతంగా నటించారు. రాశి చాలా హార్డ్ వర్క్‌తో సినిమా చేసింది. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి రుజువైంది" అని శివ కందుకూరి పేర్కొన్నాడు.

"సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇది తెలుగు ఆడియన్స్ వల్లే సాధ్యపడింది. ప్రిమియర్స్ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రతి షోకి ఫుల్ ఫాల్ పెరుగుతోంది. ఇంకా సినిమా చూడకపోతే తప్పకుండా వచ్చి థియేటర్స్‌లో చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. గొప్పగా అలరిస్తుంది'' అని భూతద్ధం భాస్కర్ నారాయణ సక్సెస్ మీట్ హీరో శివ కందుకూరి తెలిపాడు.

దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ.. "సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. మంచి రివ్యూలు వచ్చాయి. ఇది థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. అందరూ థియేటర్స్‌లో చూడాలి. నిర్మాతలకు, నటీనటులకు ధన్యవాదలు. శివ ఈ సినిమాని బలంగా నమ్మారు. సినిమా హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతోంది. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కథలు చేయగలననే నమ్మకం వచ్చింది. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి" అని కోరారు.

Whats_app_banner