Telugu folk song: తెలుగు ఫోక్ సాంగ్‌కు ప్రొడ్యూస‌ర్‌గా మంచు విష్ణు - గోదారికే సోగ్గాన్నే రిలీజ్‌-shiva balaji and madhumitha acted together for godariki soggadne folk song after a long time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Folk Song: తెలుగు ఫోక్ సాంగ్‌కు ప్రొడ్యూస‌ర్‌గా మంచు విష్ణు - గోదారికే సోగ్గాన్నే రిలీజ్‌

Telugu folk song: తెలుగు ఫోక్ సాంగ్‌కు ప్రొడ్యూస‌ర్‌గా మంచు విష్ణు - గోదారికే సోగ్గాన్నే రిలీజ్‌

Nelki Naresh HT Telugu

Telugu folk song: టాలీవుడ్ రియ‌ల్ లైఫ్ క‌పుల్ శివ‌బాలాజీ, మ‌ధుమిత క‌లిసి ఓ ఫోక్ సాంగ్‌లో న‌టించారు. గోదారికే సోగ్గాన్నే పేరుతో రూపొందిన ఈ వీడియో సాంగ్‌కు హీరో మంచు విష్ణు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ ఫోక్ వీడియో సాంగ్‌ను రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేశారు.

తెలుగు ఫోక్ సాంగ్

Telugu folk song: హీరో మంచు విష్ణు ఓ తెలుగు ఫోక్ సాంగ్‌కు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. గోదారికే సోగ్గాన్నే టైటిల్‌తో రిలీజైన ఈ పాట‌లో టాలీవుడ్ యాక్ట‌ర్లు, రియ‌ల్ లైఫ్ క‌పుల్ శివ‌బాలాజీ, మ‌ధుమిత జంట‌గా న‌టించారు. ఈ ఫోక్ వీడియో సాంగ్‌ను రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేశారు.

సింగిల్ టేక్‌లో..

ఈ సంద‌ర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘ఈ పాటలో కంటెంట్ 8 నిమిషాలు ఉంటుంది. పాటలోనే కథ మొత్తం చెప్పాలి. ఈ కాన్సెప్ట్‌కి మ్యూజికల్ న‌రేషన్ అని పేరు పెట్టాను. ముందుగా ఈ పాట‌లో నేను, మ‌ధుమిత‌ నటిస్తామని అనుకోలేదు. ఈ కాన్సెప్ట్ నా వద్దకు వచ్చింది. ఆ తరువాత మధుమిత ప్రాజెక్ట్‌లోకి ఎంట‌రైంది. . మేం ఇద్దరం సింగిల్ టేక్‌లో సాంగ్ పూర్తి చేశాం. ఈ వీడియో సాంగ్‌కు రెండు క్లైమాక్స్ ప్లాన్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

ఇన్నేళ్ల త‌ర్వాత జంట‌గా...

మధుమిత మాట్లాడుతూ .. ‘సోషల్ మీడియాలోని ఇన్ ఫ్లూయెన్సర్‌ టాలెంట్‌ను మరింతగా బయటకు తీసుకు రావాలనే ఉద్దేశంతో ఈ మ్యూజికల్ ఆల్బమ్స్‌ను స్టార్ట్ చేశాం. ఈ క్రమంలో నా వద్దకు ఈ పాట వచ్చింది. కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా పాటతో నేను, శివ‌బాలాజీ జంటగా అందరి ముందుకు రాబోతున్నాం. ఇందులో మాట్లాడిన గోదారి యాస కూడా అద్భుతంగా అనిపిస్తుంది. అందరినీ ఆకట్టుకునేలా ఈ పాట ఉంటుంది’ అని అన్నారు.

అవా మ్యూజిక్ బ్యాన‌ర్‌పై...

అవా ఎంటర్టైన్మెంట్ సీఈఓ చిదంబరం మాట్లాడుతూ .. ‘ మోహన్ బాబు , విష్ణు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు అవా మ్యూజిక్‌ను ప్రారంభించారు. మున్ముందు మరింత కంటెంట్ మా నుంచి రాబోతోంది. అని చెప్పారు. విష్ణు మంచు ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోని అవా మ్యూజిక్ బ్యానర్‌పై గోదారి సోగ్గాన్నే వీడియో సాంగ్ రూపొందింది.

హీరోయిన్‌గా...

శివ‌బాలాజీ, మ‌ధుమ‌తి క‌లిసి ఇంగ్లీష్‌కార‌న్ అనే త‌మిళ సినిమాలో న‌టించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. 2009లో పెళ్లి చేసుకున్నారు. తెలుగులో మ‌ధుమిత హీరోయిన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాలు చేసింది. శివ‌బ‌లాజీ హీరోగా తెలుగులో చంద‌మామ‌, కుంకుమ‌, దోస్త్‌, ప‌గ‌లే వెన్నెల‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. కాట‌మ‌రాయుడు, శాకుంత‌లంతో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. ప్ర‌స్తుతం మంచు విష్ణు క‌న్న‌ప్ప‌లో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం