OTT Comedy: ఓటీటీలోకి తెలుగులో మలయాళ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-shine tom chacko comedy drama vivekanandan viral movie will be streaming aha ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy: ఓటీటీలోకి తెలుగులో మలయాళ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Comedy: ఓటీటీలోకి తెలుగులో మలయాళ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 03, 2025 03:12 PM IST

OTT Comedy Movie: వివేకానందన్ వైరల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. మలయాళ మూవీకి తెలుగు వెర్షన్‍గా ఏడాది తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఏ ప్లాట్‍ఫామ్‍లో.. ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందో ఇక్కడ చూడండి.

OTT Comedy Drama: ఓటీటీలోకి తెలుగులో ఏడాది తర్వాత మలయాళ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Comedy Drama: ఓటీటీలోకి తెలుగులో ఏడాది తర్వాత మలయాళ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్ర పోషించిన ‘వివేకానందన్ వైరలను’ చిత్రం గతేడాది 2024 జనవరిలో థియేటర్లలో రిలీజైంది. డిఫరెంట్ పాయింట్‍తో ఈ మలయాళ కామెడీ డ్రామా మూవీ రూపొందింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లో వస్తోంది. తెలుగులో ‘వివేకానందన్ వైరల్’ పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. డేట్ ఫిక్స్ అయింది.

స్ట్రీమింగ్ వివరాలు

వివేకానందన్ వైరల్ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 7వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (ఫిబ్రవరి 3) వెల్లడించింది. పగలబడి నవ్వేందుకు రెడీగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఏడాది తర్వాత తెలుగులో..

వివేకానందన్ వైరలను చిత్రం గతేడాది జనవరి 19వ తేదీన మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయింది. ఇప్పుడు ఏడాది తర్వాత తెలుగు డబ్బింగ్‍లో వివేకానందన్ వైరల్ పేరుతో ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఫిబ్రవరి 7న తెలుగులో ఆహా ఓటీటీ ఈ మూవీ ఎంట్రీ ఇవ్వనుంది.

వివేకానందన్ వైరల్ సినిమాకు కమల్ దర్శకత్వం వహించారు. శృంగారంలో క్రూరత్వం చూపించే ఓ పురుషుడికి బుద్ధి చెప్పాలకునే ప్రయత్నం వైరల్ అవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. కామెడీ ప్రధానంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకోతో పాటు స్వస్తిక, గ్రేస్ ఆంటోనీ, మరీనా, మంజు పిళ్లై, జానీ ఆంథోనీ, మాలా పార్వతి కీలకపాత్రలు పోషించారు.

వివేకానందన్ వైరల్ చిత్రాన్ని నీదియత్ ప్రొడక్షన్స్ పతాకంపై నీదియత్ నయీబ్, పీఎస్ శెల్లీరాజ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావటంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకోలేకపోయింది. ఈ చిత్రానికి బాజిబల్ సంగీతం అందించారు.

వివేకానందన్ వైరల్ స్టోరీలైన్

వివేకానందన్ (షైన్ టామ్ చాకో) శృంగారానికి బానిస అయి ఉంటాడు. బెడ్‍పై శృంగారంలో వికృతంగా ప్రవర్తిస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసే అతడి భార్య సితార (స్వస్తిక).. ఇంటికి వీకెండ్‍లోనే వస్తుంటుంది. ఆమె కూడా వివేకానందన్‍తో విసిగిపోయి ఉంటుంది. ఈ క్రమంలో డయానా (మరీనా) అనే మహిళతో వివేకానందన్ సంబంధం పెట్టుకుంటాడు. ఆమెను కూడా బెడ్‍పై షాడిస్ట్‌లా వేధిస్తుంటాడు. డయానా కూడా ఆ వేధింపులు తాళలేకపోతుంది. దీంతో అతడి భార్య సితారకు అసలు విషయం చెబుతుంది. దీంతో సితార, డయానా కలిసి వివేకానందన్‍కు బుద్ధి చెప్పాలనుకుంటారు. అయితే, వారు చేసే ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారు వివేకానందన్‍ను ఏం చేశారు.. ఏ వీడియో వైరల్ అయింది.. అతడు మారాడా? అనే అంశాలు వివేకానందన్ వైరల్ చిత్రంలో ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం