Shashtipoorthi Song: ఇళయరాజా సంగీతం.. కీరవాణి లిరిక్స్.. పాట రిలీజ్ చేసిన దేవీశ్రీ ప్రసాద్
Shashtipoorthi Yedho Yejanmalodo song: షష్టిపూర్తి నుంచి తొలి పాట రిలీజైంది. మెలోడియస్‍గా ఈ సాంగ్ ఉంది. ఈ పాటకు కొన్ని స్పెషాలిటీలు కూడా ఉన్నాయి.
రూపేశ్, ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా షష్టిపూర్తి చిత్రం వస్తోంది. ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అర్చన కూడా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. లేడీస్ టైలర్ తర్వాత 30 ఏళ్ల అనంతరం మళ్లీ వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. ఈ మూవీకి మ్యూజిక్ మాస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. షష్టిపూర్తి చిత్రం నుంచి నేడు (మార్చి 25) ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.
రిలిక్స్ రాసిన కీరవాణి
షష్టిపూర్తి చిత్రం నుంచి ‘ఏదో.. ఏ జన్మలోదో’ అంటూ తొలిపాట నేడు రిలీజ్ అయింది. ఈ పాటకు మెలోడిస్ ట్యూన్ ఇచ్చారు ఇళయరాజా. లవ్ డ్యుయెట్ పాటగా వచ్చింది. ఈ సాంగ్‍కు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి లిరిక్స్ రాయడం స్పెషాలిటీగా ఉంది. ఈ సాంగ్‍కు మంచి సాహిత్యం అందించారు కీరవాణి. ఈ పాటను అనన్య భట్ ఆలపించారు.
షష్టిపూర్తి చిత్రంలోని ఈ తొలి పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ లాంచ్ చేసినట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఇలా ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటకు కీరవాణి లిరిక్స్ అందించగా.. దేవీ విడుదల చేశారు. ఏదో.. ఏ జన్మలోదో అంటూ రూపేశ్, ఆకాంక్ష మధ్య ఈ సాంగ్ సాగింది. మెలోడియస్‍గా ఉంది.
ఫ్యామిలీ బ్యాక్‍డ్రాప్‍లో..
షష్టిపూర్తి చిత్రం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీగా రూపొందుతోంది. విడిపోయిన తల్లిదండ్రులను కలిపేందుకు ఓ కొడుకు ప్రయత్నించడం చుట్టూ ఈ చిత్రం సాగుతుందని గతంలో వచ్చిన గ్లింప్స్ ద్వారా అర్థమైంది. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పవన్ ప్రభ తెరకెక్కిస్తున్నారు.
షష్టిపూర్తి మూవీలో అచ్యుత్ కుమార్, చలాకీ చంటి, ప్రభాస్ శీను, చక్రపాణి ఆనంద్, మురళీ ధర్ గౌడ్, లత, శ్వేత, సంజయ్ స్వరూప్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని మా ఆయీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. రిలీజ్ డేట్‍ను మేకర్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం