Manamey OTT: ఓటీటీలోకి ఆలస్యమవుతున్న శర్వానంద్, కృతి శెట్టి చిత్రం.. ఇంకెప్పుడు?
Manamey OTT: మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ విషయంపై సందిగ్ధత నెలకొంది.
శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మనమే సినిమా విడుదలకు ముందు ఆసక్తిని రేపింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు ఈసారి తప్పక హిట్ కొడుతున్నామంటూ శర్వా నమ్మకంగా చెప్పడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఆశించిన స్థాయిలో మనమే చిత్రం సక్సెస్ కాలేకపోయింది.

ఓటీటీ రిలీజ్ కోసం నిరీక్షణ
మనమే సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుందని తొలుత సమాచారం బయటికి వచ్చింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు అంచనాలు వచ్చాయి. జూలై తొలి వారంలోనే ఈ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానున్నట్టు రూమర్లు చక్కర్లు. కానీ అలా జరగలేదు.
మనమే సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటి వరకు అప్‍డేట్ ఇవ్వలేదు. ముందుగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు ఆహా ఓటీటీ ప్రయత్నించింది. అయితే, మేకర్స్ చెప్పిన ధరకు ఆ ఓటీటీ అంగీకరించలేదు. దీంతో ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోతో మనమే మేకర్స్ డీల్ చేసుకున్నారని తెలిసింది. అయినా ఇప్పటి వరకు మనమే చిత్రం స్ట్రీమింగ్‍కు రాలేదు. ఎలాంటి అప్‍డేట్ కూడా రాలేదు. దీంతో ఓటీటీ డీల్ ఉందా.. క్యాన్సిల్ అయిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
ఎప్పుడు రావొచ్చు?
మనమే సినిమా స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందనే సందిగ్ధత నెలకొంది. జూలై చివరి వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తాజాగా రూమర్లు వస్తున్నాయి. మరి ఈసారైనా స్ట్రీమింగ్‍కు వస్తుందో.. ఆలస్యమవుతుందో చూడాలి. ప్రైమ్ వీడియోలోనే ఈ చిత్రం వస్తుందా.. మరో ఓటీటీలో కూడా వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మనమే చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య లీడ్ రోల్స్ చేయగా.. సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, ఆయేషా ఖాన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కించారు.
మనమే చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో పదికి పైగా పాటలు ఉన్నాయి. ఖుషి, హాయ్ నాన్న చిత్రాలతో అలరించిన హేషమ్.. మనమే మూవీలో నిరాశపరిచాడు. ఈ చిత్రంలో పాటలు పెద్దగా పాపులర్ కాలేదు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
మనమే స్టోరీలైన్
తన స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్), అతడి భార్య మృతి చెందడంతో వారి కుమారుడు ఖుషి (విక్రమ్ ఆదిత్య)ని చూసుకునే బాధ్యతను విక్రమ్ (శర్వానంద్) తీసుకోవాల్సి వస్తుంది. సుభద్ర (కృతి శెట్టి) కూడా విక్రమ్‍తో కలిసి ఖుషిని చూసుకోవాల్సి వస్తుంది. పెళ్లి కాకున్నా ఖుషి కోసం తల్లిదండ్రుల్లా మారతారు విక్రమ్, సుభద్ర. వారి మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? దీని వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? విక్రమ్, సుభద్ర మధ్య ఎలాంటి రిలేషన్ ఏర్పడింది? అనేది మనమే చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
టాపిక్