Manamey OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోన్న శర్వానంద్ మనమే - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
Manamey OTT: శర్వానంద్ మనమే మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మనమే మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Manamey OTT: శర్వానంద్ మనమే థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
మిక్స్‌డ్ టాక్‌తో...
జూన్ 7న మనమే మూవీ థియేటర్ల ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. కథ రొటీన్ అంటూ టాక్ వచ్చిన శర్వానంద్ కామెడీ టైమింగ్, కృతిశెట్టితో అతడి కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నాయి. మిక్సడ్ టాక్‌తో సంబంధం లేకుండా కమర్షియల్ హిట్‌గా ఈ మూవీ నిలిచింది. పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 22 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
మనమే మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 16 నుంచి మనమే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పెషల్ అనౌన్స్‌మెంట్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో...ఓటీటీ ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
పెళ్లి కాకుండానే తల్లిదండ్రులుగా మారితే...
విక్రమ్ (శర్వానంద్) పెళ్లి పెటాకులు లేకుండా లైఫ్‌ను సరదాగా గడిపేస్తుంటాడు. ప్రాణ మిత్రుడు అనురాగ్ (త్రిగుణ్) పెళ్లిని శాంతితో విక్రమ్ దగ్గరుండి జరిపిస్తాడు. ఓ ప్రమాదంలో అనురాగ్‌తో పాటు అతడి భార్య శాంతి కన్నుమూస్తుంది. వారి కొడుకు ఖుషి అనాథగా మారిపోతాడు. దాంతో ఖుషి బాధ్యతల్ని విక్రమ్‌తో పాటు శాంతి స్నేహితురాలు సుభద్ర (కృతిశెట్టి) చేపడతారు.
పెళ్లి కాకుండానే ఖుషికి విక్రమ్, సుభద్ర తల్లిదండ్రులుగా మారుతారు. ఈ జర్నీలో వారు ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నారు? విక్రమ్, సుభద్ర ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టాన్ని ఎలా తెలుసుకున్నారు? సుభద్రకు కాబోయే భర్త కార్తీక్ (శివ కందుకూరి) ఆమెను ఎందుకు అపార్థం చేసుకున్నాడు? వీరి ప్రేమకథలో జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్) పాత్ర ఏమిటనే అంశాలతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీని తెరకెక్కించాడు.
పదహారు పాటలతో...
మనమే మూవీలో రాహుల్ రవీంద్రన్, సీరత్‌కపూర్, శివ కందుకూరి, ఆయేషాఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. దాదాపు పదహారు పాటలతో మనమే మూవీ రిలీజైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
రెండు సినిమాలు...
మనమే తర్వాత రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు శర్వానంద్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో శర్వానంద్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శర్వానంద్ బైక్ రైడర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతోన్నాయి.