Pathaan Movie Collections : పఠాన్ మూవీ బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తుందా?-sharukh khan s pathaan movie first day collections likely to beat bahubali 2 hindi version collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sharukh Khan's Pathaan Movie First Day Collections Likely To Beat Bahubali 2 Hindi Version Collections

Pathaan Movie Collections : పఠాన్ మూవీ బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తుందా?

Anand Sai HT Telugu
Jan 21, 2023 12:41 PM IST

Sharukh Khan's Pathaan Movie : షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత థియేటర్లలోకి వస్తున్న బాలీవుడ్ బాద్ షాకు హిట్ దక్కాలని కోరుకుంటున్నారు. అయితే ఓ విషయంలో పఠాన్ సినిమాను బాహుబలి 2తో పోల్చుతున్నారు.

పఠాన్ సినిమా
పఠాన్ సినిమా

పఠాన్ సినిమా(Pathaan Movie) ఎప్పుడెప్పుడు వస్తుందా.. అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు చుద్దామా అని షారుఖ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గ్రాండ్ గా స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా కేవలం హిందీలోనే కాకుండా.. తెలుగు(Telugu), తమిళ భాషల్లోనూ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాలుగేళ్ల తర్వాత.. పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్(Sharukh Khan) వస్తున్నాడు. దీంతో భారీ అంచనాలే ఉన్నాయి.

2022లో హిందీ చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదని చెప్పొచ్చు. అయితే ఈ ఏడాదిపై బాలీవుడ్(Bollywood) కన్నేసింది. ఈసారైనా.. హిట్స్ పడాలని చూస్తోంది. ఇక షారుఖ్ పఠాన్(Sharukh Pathaan) సినిమాపైనే అంచనాలు పెట్టుకున్నారు. పఠాన్ చిత్రంతో 2023 శుభవార్తగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ మీద ట్రేడ్ విశ్లేషకులు చర్చలు చేస్తున్నారు. రూ45 నుంచి 50 కోట్ల రూపాయల బిజినెస్(Business) చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే బాహుబలి 2(Bahubali 2) మెుదటి రోజు కలెక్షన్స్ తో పోల్చుతున్నారు.

హాలిడేస్‌లో మినహా విడుదలైన సినిమాల్లో హిందీలో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 పేరు తెచ్చుకుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ 41 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమా(Cinema) రికార్డును షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా బద్దలు కొడుతుందని చాలా మంది జోస్యం చెబుతున్నారు. 41 కోట్లపైనే మెుదటి రోజు కలెక్షన్స్ ఉంటాయని చెబుతున్నారు. ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్(Advance Tickets Booking) ఇప్పటికే ఓపెన్ అయింది. అసలే షారుఖ్ ఖాన్... నాలుగేళ్ల తర్వాత సినిమా.. ఇంతటి హై వోల్టేజ్ సినిమాకు టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది అభిమానులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈ విషయంపై చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. మెుదటిరోజున భారీ వసూళ్లు రాబడతాయన్న నమ్మకంతో ఉంది.

ఈ సినిమా కోసం షారుఖ్ చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చాలా దేశాల్లో చిత్రీకరించారు. పలు వివాదాలను ఎదుర్కొంటూ 'పఠాన్' విడుదలవుతోంది. యశ్ రాజ్ ఫిలింస్(Yash Raj Films) ఈ సినిమాను నిర్మించింది. సిద్ధార్థ్ ఆనంద్ పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. షారూఖ్‌ సరసన దీపికా పదుకొణె(Deepika Padukone) నటించింది. ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ దుమ్ము రేపింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.