Web Series: నీట్ ఎగ్జామ్స్‌పై త్రీ ఇడియట్స్ హీరో హిందీ వెబ్‌సిరీస్ - ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
నీట్ ఎగ్జామ్స్‌పై రూపొందిన హిందీ వెబ్‌సిరీస్ మెడికల్ డ్రీమ్స్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో త్రీ ఇడియట్స్ ఫేమ్ శర్మాన్ జోషి కీలక పాత్రలో నటించాడు.
త్రీ ఇడియట్స్ ఫేమ్ శర్మాన్ జోషి ప్రధాన పాత్రలో నటించిన మెడికల్ డ్రీమ్స్ వెబ్‌సిరీస్ యూట్యూబ్‌లో రిలీజైంది. కేవలం ఫస్ట్ ఎపిసోడ్‌ను మాత్రమే మేకర్స్ రిలీజ్ చేశారు. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్, రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ వెబ్‌సిరీస్‌ను యూట్యూబ్‌లో చూడొచ్చని మేకర్స్ ప్రకటించారు.
నీట్ ఎగ్జామ్స్‌పై...
నీట్ ఎగ్జామ్స్ రాసి డాక్టర్ కావాలని కలలు కన్న ఓ పల్లెటూరి యువతి జర్నీ నేపథ్యంలో మెడికల్ డ్రీమ్స్ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. కోచింగ్ కోసం కోటా రావాలని ఆమె ఎందుకు అనుకుంది? పోటీప్రపంచంలో ఇమడలేక ఆ యువతి ఎలాంటి ఇబ్బందులు పడింది? చివరకు తన కలను ఎలా నెరవేర్చుకుంది అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు అశుతోష్ పంకజ్ ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు.
లెక్చరర్ పాత్రలో...
ఈ సిరీస్‌లో నిన్హా అనే లెక్చరర్ పాత్రలో శర్మాన్ జోషి కనిపించారు. రమ శర్మ, ఐశ్వర్య రిషబ్ కీలక పాత్రల్లో నటించారు. అరుణభ్ కుమార్, అనంత్ భాటు ఈ సిరీస్‌కు క్రియేటర్స్‌గా వ్యవహరించారు.
నీట్ ఎగ్జామ్స్ విషయంలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? ప్రతి ఏటా లక్షలాది మందిపోటీపడే ఈ పరీక్షలో రూరల్ స్టూడెంట్స్ పాస్ కావడం సాధమయ్యే పనేనా అనే అంశాలను ఆలోచనాత్మకంగా ఈ సిరీస్‌లో చూపించారు. మిగిలిన ఎపిసోడ్స్‌ను ప్రతి వారం ఒక్కొక్కటి చొప్పున రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
త్రీ ఇడియట్స్‌తో పాటు...
బాలీవుడ్‌లో రంగ్ దే బసంతి, రఖీబ్, ధూల్, త్రీ ఇడియట్స్‌తో పాలు పలు సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు శర్మాన్ జోషి. హీరోగానే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రయోగాలు బెడిసికొట్టడంతో కొన్నాళ్లుగా శర్మాన్ జోషికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికందర్‌లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ పూజ, బారీష్, కఫాస్‌తో పాటు మరికొన్ని హిందీ వెబ్‌సిరీస్‌లలో శర్మాన్ జోషి నటించాడు.
టాపిక్