Sharma and Ambani OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ మూవీ శర్మ అండ్ అంబానీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..-sharma and ambani ott release date dhanya balakrishna crime comedy will stream on etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sharma And Ambani Ott: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ మూవీ శర్మ అండ్ అంబానీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Sharma and Ambani OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ మూవీ శర్మ అండ్ అంబానీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Sharma & Ambani OTT Release Date: ధన్యబాలకృష్ణ ప్రధాన పాత్రలో శర్మ అండ్ అంబానీ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ అయింది.

Sharma and Ambani OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ మూవీ శర్మ అండ్ అంబానీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Sharma & Ambani OTT: తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘ఈటీవీ విన్’ దూకుడు పెంచింది. ఇటీవలి కాలంలో ఎక్కువగా కొత్తకొత్త కంటెంట్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఈటీవీ విన్‍లో వచ్చిన ‘90s: ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ సూపర్ పాపులర్ అయింది. భారీ వ్యూవ్స్ దక్కించుకుంది. మరిన్ని చిత్రాలు, సిరీస్‍లు వచ్చాయి. మార్చిలో రితికా సింగ్ నటించిన వళిరి మూవీ నేరుగా ఈటీవీ విన్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇటీవల తులసీదళం అనే సిరీస్ కూడా వచ్చింది. కాగా, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మరో సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ‘శర్మ & అంబానీ’ (Sharma and Ambani) సినిమా ఆ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఆ వివరాలివే..

స్ట్రీమింగ్ డేట్ ఇదే..

‘శర్మ అండ్ అంబానీ’ చిత్రంలో ప్రముఖ నటి ధన్యబాలకృష్ణ, భరత్ తిప్పిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ కామెడీ మూవీ ఏప్రిల్ 11వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఫస్ట్ లుక్‍తో పాటు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను కూడా ఈటీవీ విన్ వెల్లడించింది.

ఫస్ట్ లుక్ ఇలా..

శర్మ అండ్ అంబానీ చిత్రానికి కార్తీక్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‍లో ధన్య బాలకృష్ణ స్కూటర్ నడుపుతుండగా.. వెనుక భరత్, కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కేశవ కర్రీ కూర్చుకున్నారు. వారిపై నోట్ల వర్షం కురుస్తుండగా.. బ్యాక్‍గ్రౌండ్‍లో డైమండ్, మ్యాప్ కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఏప్రిల్ 11న ఈ చిత్రం ఈటీవీ విన్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

శర్మ & అంబానీ చిత్రాన్ని అనిల్ పల్లా, భరత్ తిప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. శశాంక్ ఆలమూరు, మహా సంగీతం అందిస్తున్నారు. ఏకే స్వామి సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ మూవీకి గౌతమ్ రాజ్ నెరుసు ఎడిటర్‌గా ఉన్నారు.

శర్మ అండ్ అంబానీ చిత్రంలో ఆయుర్వేదిక్ డాక్టర్ శర్మగా భరత్ తిప్పిరెడ్డి నటిస్తుండగా.. సితార పాత్రను ధన్యబాలకృష్ణ పోషించినట్టు తెలుస్తోంది. అంబానీ క్యారెక్టర్‌లో కేశవ్ చేశారు. ఓ డేంజరస్ గ్యాంగ్‍తో శర్మకు అనుకోకుండా గొడవ తలెత్తుతుంది. అతడు చిక్కుల్లో పడతాడు. దీంతో పోయిన వజ్రాలను తిరిగి దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ శర్మ అండ్ అంబానీ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. శర్మ, సితార మధ్య లవ్ స్టోరీ ఉంటుంది. ఈ చిత్రంలో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జల కీలకపాత్రలు పోషిస్తున్నారు.

తులసీవనం వెబ్ సిరీస్

తులసీవనం వెబ్ సిరీస్ ఇటీవలే ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‍లోకి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నిర్మించటంతో ఈ సిరీస్‍కు మంచి బజ్ ఏర్పడింది. క్రికెటర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి చుట్టూ ఈ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. అక్షయ్ లగుసాని, వెంకటేశ్ కాకుమాను, ఐశ్వర్య ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమ్ సాగర్ దర్శకత్వం ఈ తులసీవనం సిరీస్‍కు దర్శకత్వం వహించారు.