shani salmon: బిగ్ బాస్ నుంచి షానీ ఎలిమినేట్ - ఈ వారం డబుల్ ఎలిమినేషన్-shani salmon eliminated from bigg boss 6 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shani Salmon Eliminated From Bigg Boss 6 Telugu

shani salmon: బిగ్ బాస్ నుంచి షానీ ఎలిమినేట్ - ఈ వారం డబుల్ ఎలిమినేషన్

HT Telugu Desk HT Telugu
Sep 18, 2022 12:23 PM IST

shani salmon: బిగ్ బాస్ సీజన్ 6 (Bigg boss 6 telugu) నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ గా షానీ సాల్మన్ నిలిచాడు. షానీ ఆటతీరు బాగా లేకపోవడంతో అతడిని ఎలిమినేట్ చేస్తున్నట్లుగా నాగార్జున ప్రకటించాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని పేర్కొన్నాడు.

షానీ సాల్మన్
షానీ సాల్మన్ (twitter)

shani salmon: బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ గా షానీ నిలిచాడు. ద‌స‌రాకు రిలీజ్ కానున్న త‌న నెక్స్ట్ సినిమా ది ఘోస్ట్ సినిమాలోని నీలి నీలి సంద్రం పాట‌తో ఈ వారం స్టైలిష్‌గా బిగ్‌బాస్ స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున‌. తొలివారం ఎలిమినేష‌న్ లేద‌ని ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేసిన నాగార్జున ఈ వారం మాత్రం డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించి షాక్ ఇచ్చారు.

హౌస్ మేట్స్ ఎలా ఆడుతున్నార‌నే దానిపై ఆడియెన్స్ ఓపినియ‌న్ తీసుకున్నాడు. ఆడియెన్స్ ఎవ‌రూ గేమ్ ఆడ‌టం లేదని, కేవ‌లం చిల్ కావ‌డానికే హౌజ్ కు వ‌చ్చార‌ని నాగార్జున సీరియస్ అయ్యాడు. అంద‌రిని అడిగేద్దాం. క‌డిగేద్దాం అంటూ సీరియస్ గా మొదలుపెట్టారు.

తొమ్మిది మంది వేస్ట్…

బాలాదిత్య‌, షానీ, సుదీప‌, వాసంతి, శ్రీస‌త్య‌, మ‌రీనా రోహిత్‌, అభిన‌య‌, కీర్తి, శ్రీహాన్ తొమ్మిది మందిని నిల్చోమ‌ని చెప్పాడు. వారందరూ వ‌చ్చిన అవ‌కాశాన్ని వేస్ట్ చేసుకున్నార‌ని అన్నాడు. ఈ తొమ్మిది మందిలోనే ఇద్ద‌రు ఎలిమినేట్ అవుతార‌ని నాగార్జున అన్నాడు. అన్నట్లుగా షానీని ఎలిమినేట్ చేశారు. మరొకరు ఎవరన్నది నేడు తేలనుంది. కీర్తి భ‌ట్ ఆట వేస్ట్ అని నాగార్జున పేర్కొన్నాడు. ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆట మీద లేద‌ని శ్రీస‌త్య‌కు వార్నింగ్ ఇచ్చాడు.

రోహిత్ మ‌రీనా ప‌ర్ఫార్మెన్స్ జీరో అని గట్టిగా నాగార్జున పేర్కొన్నాడు. శ్రీహాన్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడ‌ని, అభిన‌య‌శ్రీ సెకండ్ ఇన్నింగ్స్ చాలా డ‌ల్‌గా ఉంద‌ని నాగార్జున పేర్కొన్నాడు. వంట చేస్తూ గెలిచేయాల‌ని అనుకుంటే కుద‌ర‌ద‌ని సుదీప కు వార్నింగ్ ఇచ్చాడు. వ‌సంతి, షానీ సాల్మ‌న్ ఆట‌లో లేన‌ట్లుగానే ఉంద‌ని నాగార్జున పేర్కొన్నాడు. బిగ్‌బాస్ ఇచ్చిన గిఫ్ట్ ను మంచిత‌నం కోసం అంద‌రికి పంచిపెట్ట‌డం స‌రికాద‌ని, ఎవ‌రి ఆట వారు ఆడితే బాగుంటుంద‌ని బాలాదిత్యతో చెప్పాడు నాగార్జున. మనసు పెట్టి ఆడటం లేదని ఫైమాకు వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. నువ్వు ఓడిపోయిన ప‌ర్వాలేదు కానీ రేవంత్ మాత్రం గెల‌వ‌కూడ‌ద‌ని ఆడ‌టం స‌రికాద‌ని అన్నాడు.

చిల్ అవ్వడానికే వచ్చారా…

కెప్టెన్సీ టాస్క్‌ను చాలా ఈజీగా తీసుకోవ‌డం మంచిదికాద‌ని చంటికి గ‌ట్టిగా చెప్పాడు నాగార్జున. చంటి కామెడీ బాగుంద‌ని, కానీ ఆట మాత్రం అస‌లు బాగాలేద‌ని అన్నాడు. బిగ్‌బాస్ గేమ్‌ను తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని సూర్య‌తో చెప్పాడు. రేవంత్ ఐసీఎస్ లా త‌యార‌య్యాడు. అందరిని మార్చ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడ‌ని అన్నాడు. అంద‌రిని క‌రెక్ట్ చేయ‌డం మానేయ్య‌మ‌ని నాగార్జున అతడితో చెప్పాడు. ఫ‌స్ట్ నిన్ను నువ్వు క‌రెక్ట్ చేసుకోమ‌ని సూచించాడు. కానీ ఆట మాత్రం ఇర‌గ‌దీశావ్ అన్నాడు. క‌సి ఉంచి కోపం త‌గ్గించుకోమ‌ని చెప్పాడు.

గీతూ రాయల్ కు 200 మార్క్స్…

గీతూ రాయ‌ల్‌కు 200 మార్కులు ఇచ్చాడు నాగార్జున‌. అంద‌రిని ఎమోష‌న‌ల్ గా బ్లాక్ మెయిల్ చేసి కెప్టెన్ అయ్యావ‌ని రాజ‌శేఖ‌ర్ తో నాగార్జున అన్నాడు. పోరాడి కెప్టెన్ అయితే బాగుంటుంద‌ని అన్నాడు. స్టాంప్ టాస్క్ ఇచ్చి తొమ్మిది మందిలో ఎవరు వేస్ట్ అన్నది చెప్పాల‌ని మిగిలిన ప‌ద‌కొండు మంది కంటెస్టెంట్స్ ను కోరాడు నాగార్జున. ఈ స్టాంప్ టాస్క్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వ‌స్తాయో వారు ఎలిమినేట్ అవుతార‌ని అన్నాడు. ఇందులో శ్రీస‌త్య‌, షాని, వాసంతిల‌కు ఎక్కువ ఓట్లు వ‌చ్చాయి. కంటెస్టెంట్స్ తో పాటు ఆడియోన్స్ ఓపినియన్స్ పొందుపరిచిన ఎన్వలప్ లో షాని పేరు రావడంతో అతడు ఎలిమినేట్ అవుతున్న‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించాడు. బిగ్ బాస్ హౌజ్ లో అమల, శర్వానంద్ అడుగుపెట్టి కంటెస్టెంట్స్ తో పాటు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.