Shaitaan OTT: ఓటీటీలోకి ఒక్క రోజు ఆలస్యంగా బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Shaitaan OTT Release: ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హారర్ మూవీగా రికార్డుకెక్కిన సినిమా సైతాన్. అజయ్ దేవగణ్. ఆర్ మాధవన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా ఓటీటీలోకి దించుతున్నారు. కానీ, మరికొన్ని గంటల్లోనే సైతాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అదేలాగో చదివేసేయండి.
Shaitaan OTT Streaming: హిందీ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హారర్ జోనర్ సినిమాల్లో రెండో అతిపెద్ద హిట్ అందుకున్నాడు. ఇంతకుముందు అజయ్ దేవగణ్ భూత్ అనే హారర్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమాను హారర్ చిత్రాలకు స్పెషలిస్ట్ అయిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

భూత్ తర్వాత మరో హిట్
2003లో వచ్చిన భూత్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ అనంతరం అజయ్ దేవగణ్ మరో హారర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమానే సైతాన్. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డుకెక్కింది. ఈ సినిమాకు ఇండియాలో సుమారు రూ. 150 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.
10 రోజులు 100 కోట్లు
ఇక వరల్డ్ వైడ్‌గా రూ. 211 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది సైతాన్ సినిమా. అలాగే రిలీజైన 10 రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన 4వ ఇండియన్ మూవీగా పేరు తెచ్చుకుంది. అలాగే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా అవతరించింది.
భారీ ధరకు ఓటీటీ రైట్స్
అయితే, పూర్తి హారర్ అంశాలతో తెరకెక్కిన సైతాన్ సినిమా ఈపాటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుక్కున్న డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ముందుగా మే 3న సైతాన్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఒక రోజు ఆలస్యంగా సైతాన్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.
మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్
అంటే మే 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సైతాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మే 4 అర్థరాత్రి 12 గంటల నుంచే సినిమాను ప్రసారం చేసే అవకాశం ఉంది. అంటే సైతాన్ ఓటీటీ రిలీజ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
గుజరాతీ ఫిల్మ్‌కు రీమేక్
మరి చూడాలి నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి వచ్చాక సైతాన్ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు. కాగా ఈ సినిమాలో అజయ్ దేవగణ్‌తోపాటు పాపులర్ యాక్టర్, హీరో ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించారు. ఇది గుజరాతీ ఫిల్మ్ వాష్‌కు అధికారిక బాలీవుడ్ రీమేక్. దీన్ని వికాస్ బహ్ల్ తెరకెక్కించారు.
చెల్లా చెదురైన ఫ్యామిలీ
సైతాన్ సినిమాలో అజయ్ దేవగణ్, జ్యోతిక భార్యాభర్తలుగా నటిస్తే.. వీరి కుమార్తెగా జానకి బోడివాలా కుమార్తెగా చేసింది. ఇక ఆర్ మాధవన్ విలన్‌గా, తాంత్రికుడిగా నటించినట్లు తెలుస్తోంది. హ్యాపీగా గడుపుతున్న ఓ ఫ్యామిలీలోకి ఆర్ మాధవన్ ఎంట్రీ ఇవ్వడంతో వారి జీవితాలు ఎలా చెల్లాచెదురు అయ్యాయో కథాంశంగా సినిమా తెరకెక్కింది.
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్
ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ రీమేక్ అయినప్పటికీ విపరీతమైన ప్రజాదరణను పొందింది. హిందీలో ఫైటర్ అండ్ బడే మియాన్ చోటే మియాన్ తరువాత ఈ సంవత్సరంలో మూడో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. కాగా ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగణ్ ఫిల్మ్స్ అండ్ పనోరమా స్టూడియోస్ సమర్పణలో దేవగణ్, జ్యోతి దేశ్ పాండే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మించారు.