Shaitaan Collection: 65 కోట్ల హారర్ మూవీకి భారీగా తగ్గిన కలెక్షన్స్.. మొత్తంగా వచ్చింది మాత్రం ఎక్కువే!
Shaitaan 11 Days Box Office: బాలీవుడ్‌లో వచ్చిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం సైతాన్. మార్చి 8న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్స్ బాగున్నాయి. ఈ నేపథ్యంలో సైతాన్ 11 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.
Shaitaan Day 11 Collections: సైతాన్ సినిమాకు రెండో సోమవారం కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సైతాన్ మూవీకి 11వ రోజు రూ. 3 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ఇంతకు ముందు ఈ బాలీవుడ్ సినిమా రెండో ఆదివారం నాడు అంటే 10వ రోజున భారతదేశంలో రూ. 9.75 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించింది. అంటే, 11వ రోజు మండేకు వచ్చేసరికి 14.71% శాతం భారీగా తగ్గింది.
అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్ నటించిన సూపర్ నేచురల్ మూవీ రెండవ శుక్రవారం దేశీయ మార్కెట్‌లో రూ.5.05 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత రోజు శనివారం అంటే సెకండ్ వీక్‌లో రూ. 8.5 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది శుక్రవారంతో పోలిస్తే మరుసటి రోజుకు 68.32% వృద్ధి సాధించింది. శనివారం వీకెండ్ కాబట్టి బాలీవుడ్‌లో కలెక్షన్స్ పెరిగినట్లుగా అంచనా వేయవచ్చు.
ఇక సైతాన్ సినిమా విడుదల రోజు అయిన మార్చి 8న ఇండియన్ మార్కెట్‌లో రూ.14.75 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. సూపర్ నేచురల్ హారర్-థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన సైతాన్ సినిమా మొదటి శనివారం 27.12% వృద్ధిని సాధించింది. అలాగే రూ. 18.75 కోట్ల నికర వసూళ్లు కలెక్ట్ చేసింది. కాగా మొదటి ఆదివారం 9.33% వృద్ధిని సాధించింది. రూ. 20.5 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా తొలి వారంలో ఇండియాలో రూ. 79.75 కోట్ల వసూళ్లు రాబట్టింది.
అయితే, మొదటి సోమవారం కూడా ఇలాగే సైతాన్ సినిమాకు కలెక్షన్స్ తగ్గాయి. అంటే ప్రతి మండే కలెక్షన్స్ ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ వీక్ శనివారం నాడు రూ. 7.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అప్పటి నుంచి స్థిరంగా ఉంటూ మంగళవారం ఈ సినిమా రూ.6.5 కోట్లు వసూలు చేసింది. బుధవారం రూ. 6.25 కోట్ల బిజినెస్ చేసింది. గురువారం రూ. 5.75 కోట్లు రాబట్టింది. అలాగే సైతన్ మూవీ ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 23.5 కోట్లు కలెక్ట్ చేయగా.. ఇండియాలో రూ.121.5 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
సైతాన్ సినిమా విడుదలైన మొదటి 11 రోజుల్లోనే రూ. 145 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే, సైతాన్ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. దాన్ని 2023 సంవత్సరంలో వచ్చిన వాష్ అనే గుజరాతీ చిత్రానికి రీమేక్ చేయి చిత్రీకరించారు. సైతన్ సినిమాను మొత్తంగా రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం.