Pathaan OTT Release Date: షారుఖ్‌ఖాన్ పఠాన్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే…
Pathaan OTT Release Date: పఠాన్ సినిమాతో రీఎంట్రీలో అదరగొట్టాడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్. బుధవారం రిలీజైన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. పఠాన్ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే...
Pathaan OTT Release Date: బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన షారుఖ్‌ఖాన్ పఠాన్ మూవీ వరల్డ్ వైడ్‌గా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తొలిరోజు దాదాపు యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
పఠాన్ ఓటీటీ రైట్స్‌ను రిలీజ్‌కు ముందే అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నది. షారుఖ్‌ఖాన్ సినిమాపై ఉన్న క్రేజ్‌తో దాదాపు వంద కోట్లకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో రిలీజైన మూడు నెలలకు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలతో అమెజాన్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఒప్పందం ప్రకారం ఏప్రిల్ నెలాఖరున పఠాన్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 25 ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. పఠాన్‌తో దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్‌సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ఇందులో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటించింది. జాన్ ఆబ్రహం విలన్‌గా కనిపించాడు. ఇండియాపై కుట్రలు పన్నిన జిమ్ అనే ప్రైవేట్ ఏజెంట్‌ను పఠాన్ అనే రా ఏజెంట్ ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ.
ఇందులో రా ఏజెంట్‌గా షారుఖ్‌ఖాన్ యాక్టింగ్, అతడి క్యారెక్టరైజేషన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కంప్లీట్ యాక్షన్ రోల్‌లో షారుఖ్ యాక్టింగ్ అద్భుతమంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. పఠాన్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు.