Jawan OTT: రికార్డు లెవెల్లో జవాన్ ఓటీటీ రైట్స్.. ఆ రెండింట్లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Jawan Movie OTT Release: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో జవాన్ మూవీ ఓటీటీ డీల్ ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ బాద్ షా ఇటీవల పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సుమారు నాలుగేళ్ల తర్వాత సూపర్ హిట్ కొట్టిన షారుక్ ఆ పరంపరను జవాన్ సినిమాతో కొనసాగిస్తున్నాడు. తమిళ పాపులర్ దర్శకుడు అట్లీ, షారుక్ ఖాన్ కాంబినేషన్‍లో వచ్చిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై ప్రేక్షకులు, రివ్యూల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ తండ్రీకొడుకు పాత్రల్లో డ్యుయెల్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. అలాగే సందేశాత్మకంగా తెరకెక్కిన జవాన్ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
జవాన్ సినిమా ఇప్పటికే రూ. 574 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ చేసింది. భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న జవాన్ మూవీ ఓటీటీ రైట్స్, దాని డీల్ ధర ఆసక్తిగా మారింది. జవాన్ మూవీ ఓటీటీ ధరకు రికార్డు స్థాయిలో ధర పలికినట్లు సమాచారం. జవాన్ ఓటీటీ హక్కుల కోసం చాలా సంస్థళు పోటీపడగా.. ఆఖరుకు దిగ్గజ సంస్థ నెట్‍ఫ్లిక్స్ రూ. 250 కోట్లతో చేజిక్కుంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జవాన్ హిందీ వెర్షన్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుందని సమాచారం.
ఇక జవాన్ సినిమాను రెండు సంస్థలు సొంతం చేసుకోగా.. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారంగా ఎలాంటి ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ, జవాన్ మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ ఇవేనంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్.
ఇదిలా ఉంటే జవాన్ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార పోలీస్ ఆఫీసర్‍గా అలరించగా.. బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె కెమియో రోల్‍తో అదరగొట్టింది. ఇంకా జవాన్‍లో విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్య మల్హోత్రా, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, బిగ్ బాస్ సిరి హన్మంతు, సంజయ్ దత్ తదితరులు నటించారు.