Jawan 1st Week Collection: వసూళ్లు తగ్గిన జవాన్ సంచలనం.. తొలి చిత్రంగా రికార్డ్.. కోట్లల్లో లాభాలు-shahrukh khan jawan movie 7 days worldwide box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Shahrukh Khan Jawan Movie 7 Days Worldwide Box Office Collection

Jawan 1st Week Collection: వసూళ్లు తగ్గిన జవాన్ సంచలనం.. తొలి చిత్రంగా రికార్డ్.. కోట్లల్లో లాభాలు

Sanjiv Kumar HT Telugu
Sep 14, 2023 12:05 PM IST

Jawan 7 Days Worldwide Collection: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ లేటెస్ట్ సినిమా జవాన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కానీ, మొదటి వారం వచ్చేసరికి కలెక్షన్స్ తగ్గినట్లు తెలుస్తోంది.

జవాన్ 7 డేస్ కలెక్షన్స్
జవాన్ 7 డేస్ కలెక్షన్స్

ప్రీ రిలీజ్ బిజినెస్

ట్రెండింగ్ వార్తలు

జవాన్ చిత్రం కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మార్కెట్‍కు తగినట్లుగానే బిజినెస్ చేసుకుంది. ఈ సినిమా హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అలా జవాన్ సినిమాకు సుమారు రూ. 300 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అయింది. అంతేకాకుండా షారుక్ ఖాన్ రేంజ్‍లో జవాన్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‍గా 10 వేలకుపైగా థియేటర్లలో విడుదల చేశారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 3 వేలకుపైగా థియేటర్లు జవాన్ సినిమాకు కేటాయించారు.

7వ రోజు నెట్ కలెక్షన్స్

సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార పోలీస్ ఆఫీసర్‍గా అలరించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న విడుదలైంది. అప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్‍తో పాటు కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తూ వస్తోంది. ఆ హవా ఇప్పుడు పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జవాన్ చిత్రానికి ఏడో రోజున రూ. 23 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి. ఇందులో హిందీ వెర్షన్‍కు రూ. 21.5 కోట్లు, తమిళం రూ. 95 లక్షలు, తెలుగు వెర్షన్‍కు రూ. 85 లక్షలు వచ్చినట్లు సమాచారం.

వారం రోజుల కలెక్షన్స్

జవాన్ మూవీకి మొదటి రోజున రూ. 75 కోట్లు, రెండో రోజున రూ. 53.23 కోట్లు, మూడవ రోజున రూ. 77.83 కోట్లు, నాలుగో రోజు రూ. 80.1 కోట్లు, 5వ రోజు రూ. 32.92 కోట్లు, ఆరవ రోజు తక్కువగా రూ. 26 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఏడో రోజున ఇంకా తక్కువగా రూ. 23 కోట్లు వచ్చాయి. ఇలా అన్ని కలుపుకుని జవాన్ మూవీకి వారం రోజుల్లో రూ. 368.38 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వాటిలో హిందీ రూ. 328.08 కోట్లు, తమిళం రూ. 23.01 కోట్లు, తెలుగు రూ. 17.29 కోట్లుగా ఉన్నాయి.

రికార్డ్ అండ్ లాభాలు

జవాన్ సినిమాకు ఏడు రోజుల్లో వరల్డ్ వైడ్‍గా రూ. 368.38 కోట్లు నెట్ కలెక్షన్స్ తోపాటు రూ. 665 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో వారంలోనే రూ. 650 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ చిత్రంగా జవాన్ రికార్డుకెక్కింది. ఇదే షారుక్ నటించిన పఠాన్ రూ. 630 కోట్లు తెచ్చిపెట్టింది. ఇక జవాన్ సినిమాకు వచ్చిన నెట్ కలెక్షన్స్ తో చూస్తే మొత్తంగా రూ. 68.38 కోట్ల లాభాలు వచ్చినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.