Jawan 6 Days Collection: 600 కోట్లు కొల్లగొట్టిన జవాన్.. తెలుగులో లాభాలు ఎంతో తెలుసా?
Jawan 6 Days Worldwide Collection: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా జవాన్. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో జవాన్ 6 రోజుల వసూళ్లు చూస్తే..
6వ రోజున తెలుగులో
ట్రెండింగ్ వార్తలు
షారుక్ ఖాన్, లేడి సూపర్ స్టార్ నయనతార తొలిసారి జంటగా నటించిన జవాన్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో జవాన్ మూవీకి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. జవాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రేక్షకులు భారీ ఎత్తున వీక్షిస్తున్నారు. దీంతో జవాన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున రూ. 2.45 కోట్ల కలెక్షన్స్ వసూళు అయ్యాయి.
తెలుగులో లాభాలు
బిగ్ బాస్ సిరి హన్మంతు తళుక్కున మెరిసిన జవాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులకు రూ. 38.85 కోట్లు గ్రాస్, రూ. 19.30 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. కాగా ఈ సినిమాకు ఏపీ, తెలంగాణలో రూ. 17.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా రూ. 18.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో జవాన్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని రూ. 80 లక్షల లాభం తెచ్చుకుని హిట్‍గా నిలిచింది.
6 రోజుల కలెక్షన్స్ డీటెల్స్
జవాన్ సినిమా హిందీ కలెక్షన్స్ వివరాలు చూస్తే.. తొలి రోజున రూ. 65.50 కోట్లు, రెండో రోజు రూ. 46.23 కోట్లు, మూడవ రోజు రూ. 68.72 కోట్లు, నాలుగో రోజు రూ. 71.63 కోట్లు, ఐదో రోజు రూ. 30.50 కోట్లు, ఆరవ రోజున రూ. 24 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఇలా మొత్తంగా హిందీలో 6 రోజులకు జవాన్ సినిమాకు రూ. 306.58 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా
షారుక్ జవాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూళ్లతో అదరగొడుతోంది. ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 38.85 కోట్లు, తమిళనాడులో రూ. 31.75 కోట్లు, కర్ణాటకలో రూ. 32.45 కోట్లు, కేరళలో రూ. 10.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 301.05 కోట్లు, ఓవర్సీస్‍లో రూ. 199.75 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది జవాన్ సినిమా. ఇలా వరల్డ్ వైడ్‍గా 6 రోజులకు కలిపి మొత్తంగా రూ. 614.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.