Jawan 8 Days Collection: జవాన్ వసూళ్లు ఢమాల్.. కానీ, భారీగా లాభాలు.. తెలుగు కలెక్షన్స్ ఇవే!
Jawan 8 Days Worldwide Collection: పఠాన్ తర్వాత వెంటనే మరో భారీ హిట్ కొట్టిన షారుక్ ఖాన్ చిత్రం జవాన్. దీనికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వసూళ్లు రికార్డ్స్ క్రియేటే చేశాయి. కానీ, 8వ రోజుకు వచ్చేసరికి మాత్రం తగ్గాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
8వ రోజు నెట్ కలెక్షన్స్
బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె అదిరిపోయే కెమియో రోల్ చేసిన జవాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. సినిమాలోని స్టంట్స్, యాక్షన్స్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాకు కలెక్షన్స్ పెరుగ్గా 8వ రోజు మాత్రం తగ్గాయి. జవాన్ సినిమాకు 8వ రోజున రూ. 18 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా రూ. 28 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు రిపోర్ట్ ఇచ్చారు.
ఓవర్సీస్ లో భారీగా
బాలీవుడ్ బాద్ షా అయినా షారుక్ ఖాన్‍కు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు ఏపీ, తెలంగాణలో సైతం భారీ వసూళ్లను నమోదు చేస్తాయి. ఇప్పుడు జవాన్ సినిమాకు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. జవాన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజున రూ. 2 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్‍లో 8 రోజులకు రూ. 215.07 కోట్లు వచ్చినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
మొత్తంగా లాభాలు
ఇక షారుక్ ఖాన్-నయనతార జవాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లో రూ. 386.28 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ. 678 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం. ఇప్పటివరకు వచ్చిన నెట్ కలెక్షన్లలో హిందీ నుంచి రూ. 345.88 కోట్లు, తమిళంలో రూ. 23.06 కోట్లు, తెలుగులో రూ. 17.34 కోట్ల వసూళ్లు ఉన్నాయి. ఇక రెడ్ చిల్లీస్ బ్యానర్‍పై షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి రూ. 86.28 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.